news18-telugu
Updated: November 7, 2019, 3:57 PM IST
BEL Recruitment 2019: మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగాలు... వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)
బీటెక్, బీఈ, డిప్లొమా పాసైనవారికి శుభవార్త. రక్షణ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు నంవబర్ 10న మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యూనిట్లో నేరుగా పరీక్షకు హాజరు కావొచ్చు. అంతకన్నా ముందుగా
www.mhrdnats.gov.in వెబ్సైట్లో బీఈఎల్ అప్రెంటీస్ రిజిస్ట్రేషన్-2019 పూర్తి చేయాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.

Source: Bharat Electronics Limited
BEL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్ కంప్యూటర్స్ సైన్స్ అభ్యర్థులు అర్హులు.
టెక్నికల్ (డిప్లొమా) అప్రెంటీస్- ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్ అభ్యర్థులు అర్హులు.
విద్యార్హత- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌షిప్ కోసం బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్‌షిప్ కోసం డిప్లొమా పాస్ కావాలి.
వేతనం- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు నెలకు రూ.11,110. డిప్లొమా అప్రెంటీస్‌కు నెలకు రూ.10,400.రాతపరీక్ష నిర్వహించే స్థలం:
Bharat Electronics
Limited, Ravindranath
Tagore Road,
Machilipatnam - 521001.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Xiaomi Mi CC9 Pro: 108 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ ఎంఐ సీసీ9 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Job Notifications: రైల్వేతో పాటు పలు సంస్థల్లో 13,000 పైగా పోస్టులు... ఆ కోర్సు చేసినవారికి మాత్రమే
Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... 2029 ఖాళీల భర్తీ
IBPS SO 2019: డిగ్రీ పాసైనవారికి 1163 బ్యాంక్ జాబ్స్... మొదలైన దరఖాస్తు ప్రక్రియ
Published by:
Santhosh Kumar S
First published:
November 7, 2019, 3:53 PM IST