Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 174 ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు

BEL Recruitment 2020 | ఐటీఐ, బీటెక్ పాసైనవారికి శుభవార్త. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: March 13, 2020, 11:22 AM IST
Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 174 ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు
Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 174 జాబ్స్... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL పలు పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 174 ఖాళీలున్నాయి. అందులో 150 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులు కాగా, 24 డిప్యూటీ ఇంజనీర్ పోస్టులున్నాయి. బీఈఎల్ ఘజియాబాద్ యూనిట్‌లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పోస్టును బట్టి వేతనం రూ.1,40,000 వరకు ఉంటుంది. ఐటీఐ టెక్నీషియన్స్‌తో పాటు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ కూడా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఇవి ఏడాది లేదా రెండేళ్ల తాత్కాలిక పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్రెంటీస్ పోస్టుల దరఖాస్తుకు 2020 మార్చి 16 చివరి తేదీ కాగా, ఇంజనీర్ పోస్టుల దరఖాస్తుకు మార్చి 21 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://bel-india.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

BEL Recruitment 2020: ఖాళీల వివరాలివే...



మొత్తం ఖాళీలు- 174
డిప్యూటీ ఇంజనీర్- 24
ఫిట్టర్- 16
టర్నర్- 4
ఎలక్ట్రీషియన్- 14ఎలక్ట్రానిక్ మెకానిక్- 19
మెషినిస్ట్- 5
డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్)- 4
డ్రాఫ్ట్స్‌మెన్ (మెకానికల్)- 9
రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ- 4
ఎలక్ట్రోప్లేటర్- 4
వెల్డర్- 3
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 69

BEL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...


అప్రెంటీస్, డిప్యూటీ ఇంజనీర్ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లను జారీ చేసింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL. అప్రెంటీస్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. https://apprenticeship.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక డిప్యూటీ ఇంజనీర్ పోస్టులకు http://bel-india.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. దరఖాస్తుల్ని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. డిప్యూటీ ఇంజనీర్ పోస్టులకు అప్లై చేసినవాళ్లు తమ దరఖాస్తు ఫామ్స్‌ని పంపాల్సిన అడ్రస్ ఇదే.
Manager (HR/ES & SW),
Bharat Electronics Limited,
Jalahalli Post, Bengaluru 560013.

అప్రెంటీస్, డిప్యూటీ ఇంజనీర్ పోస్టుల నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

BSNL Jobs: బీఎస్ఎన్ఎల్‌ తెలంగాణ సర్కిల్‌లో 100 జాబ్స్... మార్చి 16 లాస్ట్ డేట్

Telangana Jobs: తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు

TSPSC Jobs: హైదరాబాద్ వాటర్ బోర్డులో ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్

 
First published: March 13, 2020, 11:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading