హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

BCCL Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..

BCCL Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..

BCCL Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..

BCCL Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..

BCCL Recruitment 2022: కోల్ ఇండియా లిమిటెడ్ పరిధిలో ఉన్న భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (BCCL) సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బొగ్గు ఉత్పత్తిలో ఈ సంస్థ ప్రపంచలోనే పెద్దది. ఇప్పటికే దీనిలో 2.48 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉన్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

కోల్ ఇండియా లిమిటెడ్ పరిధిలో ఉన్న భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (BCCL) సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. బొగ్గు ఉత్పత్తిలో ఈ సంస్థ ప్రపంచలోనే పెద్దది. ఇప్పటికే దీనిలో 2.48 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉన్నారు. పశ్చిమ బెంగాల్(West Bengal), ఝార్ఖండ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్(Madhya Pradesh), మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఉత్తర ప్రదేశ్, అస్సాం(Assam) రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న కోల్ ఇండియా(Coal India) పలు మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తోంది. దీనికి సంబంధించి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ సంస్థతో కలిసి పనిచేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

APPSC 5 Notifications: APPSC నుంచి 5 నోటిఫికేషన్లు.. అర్హత, చివరి తేదీ, పోస్టుల వివరాలిలా..

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 41 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 13 ఉండగా.. సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ (E4)/ మెడికల్ స్పెషలిస్ట్ (E3) పోస్టులు 28 ఉన్నాయి.

విభాగాల వారీగా మెడికల్ స్పెషలిస్ట్ పోస్టుల వివరాలిలా ఉన్నాయి.

జనరల్ ఫిజీషియన్ – 7

ఆర్థోపెడిక్ – 5

రేడియాలజిస్ట్ – 4

ఈఎన్టీ – 2

సర్జన్ – 2

పాథాలజిస్ట్ – 2

పుల్మొనోలాజిస్ట్/ చెస్ట్ స్పెషలిస్ట్ – 2

పీడియాట్రిషన్ – 1

సైకియాట్రిస్ట్ – 1

డెర్మాటోలాజిస్ట్ – 1

ఆప్తల్మాలజిస్ట్ – 1

RRB Group D Exam Results: గ్రూప్ D అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష ఫలితాలపై అప్ డేట్..

అర్హతల విషయానికి వస్తే.. 

సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ పోస్టుల్లో.. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసన్, పుల్మొనరీ మెడిసన్ ఉద్యోగాలకు.. గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ లేదా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే ఆమోదించబడిన కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డీఎంబీ డిగ్రీల్లో కనీసం 3 ఏళ్ల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి. ఇతర స్పెషలిస్ట్ ఉద్యోగాలకు.. పైన పేర్కొన్న వాటితో పాటు డిప్లొమాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కూడా కనీస అర్హతగా పరిగణిస్తారు.

మెడికల్ స్పెషలిస్ట్ పోస్ట్ అర్హతలు:

జనరల్ సర్జరీ, జనరల్ మెడిసన్, పుల్మొనరీ మెడిసన్ ఉద్యోగాలకు.. గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ లేదా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదించిన కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డీఎంబీ చేసి ఉండాలి. ఇతర స్పెషలిస్ట్ ఉద్యోగాలకు.. పైన పేర్కొన్న వాటితో పాటు డిప్లొమాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కూడా కనీస అర్హతగా పరిగణిస్తారు.

సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్ట్..

గుర్తింపు పొందిన ఇన్సిటిట్యూట్ లేదా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదించిన కాలేజ్ నుండి ఎంబీబీఎస్ చేసి ఉండాలి.

TSPSC Halltickets: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాలకు పరీక్ష తేదీ ఖరారు.. వివరాలిలా..

వయోపరిమితి

సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ (E4 గ్రేడ్)కి గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు మరియు సీనియర్ మెడికల్ ఆఫీసర్/మెడికల్ స్పెషలిస్ట్‌కు 35 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం..

సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ (E4 గ్రేడ్) పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి రూ. 70 వేల నుండి రూ. 2 లక్షల వరకు జీతం ఇవ్వబడుతుంది. మెడికల్ స్పెషలిస్ట్ (E3) జీతం రూ. 60 వేల నుండి రూ. 1 లక్ష 80 వేల వరకు ఉంటుంది. సీనియర్ మెడికల్ ఆఫీసర్ (E3) పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు 60 వేల నుండి 1 లక్షా 80 వేల రూపాయల వరకు జీతం ఇవ్వబడుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి:

-అభ్యర్థి అధికారిక సైట్ www.coalindia.inకి వెళ్లి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి నింపాలి.

-ఆ తర్వాత ఫారమ్‌ను జనరల్ మేనేజర్ (పర్సనల్ / ఇఇ), భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్, ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లిష్‌మెంట్, కోయిలా భవన్, పోస్ట్: కోయిలా నగర్, బిసిసిఎల్ టౌన్‌షిప్, జిల్లా ధన్‌బాద్, జార్ఖండ్ - 826005కు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Central Government Jobs, JOBS

ఉత్తమ కథలు