Medicine : చాలా మంది విద్యార్థులు ఇండియాలోనే గుర్తింపు పొందిన మెడికల్ యూనివర్సిటీల్లో(Medical university) మెడిసిన్ చదవాలని భావిస్తారు. అందరికీ ఆ అవకాశాలు లభించవు. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ NEET క్లియర్ చేసిన వారికి మాత్రమే సీట్లు లభిస్తాయి. దేశంలోని మెడికల్ కాలేజీల్లో ఉన్న 80,000 సీట్ల కోసం ఏటా 7 లక్షల మంది పోటీ పడుతున్నారు. నీట్ 2022 ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యేందుకు 9,93,069 మంది అభ్యర్థులు ప్రయత్నించారు. క్వాలిఫై అయిన అభ్యర్థులకు కూడా సీట్లు లభించే ఛాన్సెస్ అంతగా లేవు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు మెడిసిన్ చదివేందుకు విదేశాల వైపు చూస్తున్నారు. తక్కువ ఫీజులతో మంచి ఎడ్యుకేషన్ అందించే వాటి కోసం చూస్తున్నారు.
మెడిసిన్‌కు ఉక్రెయిన్ ఫేమస్
గత కొన్నేళ్లుగా భారత విద్యార్థులు మెడిసిన్ చదివేందుకు ఉక్రెయిన్‌కు వెళ్తున్నారు. ఉక్రెయిన్‌లో మెడికల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో తక్కువ ట్యూషన్ ఫీజు ఉండటంతో పాటు స్టాండర్డ్ ఎడ్యుకేషన్ లభిస్తుంది. దాంతో భారత విద్యార్థులు మెడిసిన్ చదివేందుకు అక్కడికి వెళ్తున్నారు. అలా ఈ దేశం డాక్టర్ చదవాలనుకునే విద్యార్థులకు ఎడ్యుకేషన్ డెస్టినేషన్‌గా మారింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల పరిస్థితులు మారాయి. విద్యార్థులు ప్రస్తుతం ఉక్రెయిన్‌కు వెళ్లి మెడిసిన్ చదివే పరిస్థితులు లేవు.
కిర్గిస్థాన్(Kyrgyzstan)
కిర్గిస్థాన్(Kyrgyzstan)లోని మెడికల్ యూనివర్సిటీల్లో 5 శాతం సీట్లు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం రిజర్వ్ చేస్తారు. ఆ కోటాలో భారత విద్యార్థులు మెడిసిన్ చదవవచ్చు. ఎంబీబీఎస్(MBBS) చదవాలనుకునే అభ్యర్థులకు ఈ దేశంలోని మెడికల్ యూనివర్సిటీల్లో తక్కువ బడ్జెట్‌లోనే మెడికల్ ఎడ్యుకేషన్ లభిస్తుంది.
Helicopter Crash : కేదార్ నాథ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్..భక్తులు,పైలట్లు మృతి
బంగ్లాదేశ్
ఈ దేశంలోని మెడికల్ యూనివర్సిటీల్లో టీచింగ్ హై స్టాండర్డ్స్‌లో ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. ఎంబీబీఎష్ ఎన్ఎంసీ పాసింగ్ పర్సంటేజీ ఇతర దేశాల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. విదేశాల విద్యార్థులతో పాటు భారతీయ విద్యార్థులు చాలా మంది మెడిసిన్ కోసం బంగ్లాదేశ్‌కు వెళ్తున్నారు. మెడిసిన్‌కు ఈ దేశంలోని యూనివర్సిటీలు బెస్ట్ ఛాయిస్ అని విద్యావేత్తలు చెబుతున్నారు.
కజకిస్థాన్
డబ్ల్యూహెచ్ఓ(WHO), USMLE, IMED, GMC, NMC వంటి ఉన్నత సంస్థల గుర్తింపు పొందిన టాప్ మెడికల్ యూనివర్సిటీలు కజకిస్థాన్(Kazakhstan)లో ఉన్నాయి. ఈ కంట్రీలోని విశ్వవిద్యాలయాల్లో హై క్వాలిటీ స్కూలింగ్ మెథడాలజీ గురించి తెలుసుకోవాలని మెడిసిన్ విద్యార్థులు అనుకుంటున్నారు. క్లినికల్ ట్రైనింగ్ ఈ యూనివర్సిటీల్లో ది బెస్ట్‌గా ఉంటుందని నిపుణులు వెల్లడించారు.
ఫిలిప్పైన్స్(Philippines)
ఫిలిప్పైన్స్(Philippines)లోనూ లో బడ్జెట్‌లో డాక్టర్ చదువు చదవవచ్చు. ఇక్కడ మెడిసిన్ చేసిన వారిని MD(Doctor Of Medicine) అని పిలుస్తారు. ఇది ఎంబీబీఎస్(MBBS)తో సమానం. ఉత్తమ చదువులు అందించడంతో పాటు పరిశోధన, ట్రైనింగ్ తదితర విషయాల్లో బెస్ట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఫిలిప్పైన్స్‌లో ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ఈ నేపథ్యంలో భారతీయ మెడికల్ విద్యార్థులు ఈ దేశానికి మెడిసిన్ చదవడానికి రావడం ఉత్తమమని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Medical study, Medicine, Study abroad