హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB : రైల్వే ఉద్యోగాల పేరుతో గాలం... అసత్య ప్రకటనలు నమ్మొద్దన్న సౌత్ సెంట్రల్ రైల్వే

RRB : రైల్వే ఉద్యోగాల పేరుతో గాలం... అసత్య ప్రకటనలు నమ్మొద్దన్న సౌత్ సెంట్రల్ రైల్వే

RRB : రైల్వే ఉద్యోగాల పేరుతో గాలం... అసత్య ప్రకటనలు నమ్మొద్దన్న సౌత్ సెంట్రల్ రైల్వే

RRB : రైల్వే ఉద్యోగాల పేరుతో గాలం... అసత్య ప్రకటనలు నమ్మొద్దన్న సౌత్ సెంట్రల్ రైల్వే

Indian Railways Jobs | RRB : ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చాలా మంది నిరుద్యోగుల్ని నిండా ముంచుతున్నారు. అసలీ స్కాములు ఎలా జరుగుతున్నాయో తెలుసా? సౌత్ సెంట్రల్ రైల్వే హెచ్చరికను తెలుసుకుందాం.

  Indian Railways Jobs | RRB : ఇండియాలో ఎప్పటికీ హాట్ కేకుల్లాంటి ఉద్యోగాలు ఏవంటే... రైల్వే ఉద్యోగాలే అని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఏవో ఒక ఉద్యోగ ప్రకటనలు వస్తూనే ఉంటాయి. సరిగ్గా ఈ పరిస్థితినే క్యాష్ చేసుకుంటున్నారు అక్రమార్కులు. రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ... నిరుద్యోగులకు దగ్గరవుతున్నారు. పద్ధతిగా ఎగ్జామ్స్ రాసి, ఇంటర్వ్యూలు ఫేస్ చేస్తే... ఉద్యోగాలు రావనీ... అదే తమకు ఓ రెండు లక్షలు కొడితే... జాబ్ గ్యారెంటీ అంటూ మాయమాటలు చెబుతున్నారు. తమకు రైల్వేలే ఉన్నతస్థాయి ఉద్యోగులు తెలుసు అనీ... వారిని మేనేజ్ చేసి... ఉద్యోగాలు వచ్చేలా చేయగలమని నిరుద్యోగులకు ఆశలు రేకెత్తిస్తున్నారు. ఇలాంటి కొండెగాళ్ల మాటలు నమ్మి నిరుద్యోగులు అప్పులు చేసి మరీ రైల్వే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. చివరకు ఉద్యోగం రాకపోగా... ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన కేటుగాళ్లు ఆ ఏరియా నుంచీ చెక్కేస్తున్నారు. ఇలాంటి వాళ్ల ఉచ్చులో పడి రోజూ దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది డబ్బులు, టైమూ పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్య బాగా ఎక్కువైంది. అందుకే అప్రమత్తమైన సౌత్ సెంట్రల్ రైల్వే... వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తోంది. అసత్య ప్రకటనలు, కల్లబొల్లి మాటలూ నమ్మకండి అంటూ నిరుద్యోగులు, అభ్యర్థులకు సూచిస్తూ ఓ ప్రకటన రిలీజ్ చేసింది.

  రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని రైల్వే పాలనా విభాగం (Administration) చూసుకుంటుందనీ, అదే రిక్రూట్‌మెంట్ కోసం ఓ పద్ధతిలో RRB (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్స్) ద్వారా ఎగ్జామ్స్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందని తెలిపింది. ఒక్కోసారి జోనల్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్స్ (RRC) ద్వారా కూడా అభ్యర్థుల భర్తీ ప్రక్రియ ఉంటుందని వివరించింది.

  సహజంగా రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు... న్యూస్ పేపర్లలో, ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో వస్తాయి. వాటిలో వివరాల ఆధారంగా అభ్యర్థులు ప్రిపేర్ కావడం మేలు. ఈ ఉద్యోగాలకు నిర్వహించే ఎగ్జామ్ చాలా స్పష్టంగా ఉంటాయి. వీటిలో ఎన్నికైన అభ్యర్థులకు వ్యక్తిగతంగా కాల్ లెటర్ వస్తుంది. ఆ తర్వాత ఎడ్యుకేషన్ రికార్డ్స్ పరిశీలిస్తారు. నెక్ట్స్... మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. అందువల్ల మధ్యవర్తులెవరూ ఈ ఉద్యోగాల్ని ఇవ్వలేరని గుర్తించాలంటోంది ఇండియన్ రైల్వేస్‌లోని సౌత్ సెంట్రల్ రైల్వే. కాబట్టి ఇకపై ఎవరైనా ఇలా రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని అంటే... వెంటనే వారిపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమంటున్నారు అధికారులు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Indian Railways, RRB, South Central Railways

  ఉత్తమ కథలు