CBSE Board Exam 2023: త్వరలోనే సీబీఎస్‌ఈ బోర్డ్ పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి పరీక్షలు జరగనుండడంతో ఇప్పటికే విద్యార్థులు ప్రిపరేషన్‌లో నిమగ్నమయ్యారు. చాలా మంది విద్యార్థులు మ్యాథ్స్‌ను కఠినమైనదిగా భావిస్తారు. అయితే ఈ సబ్జెక్టుపై పట్టు సాధించడానికి, పరీక్షలో మంచి స్కోర్ చేయడానికి అవసరమైన టిప్స్, ముఖ్యమైన ఛాప్టర్స్ వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
వెయిటేజీ ఛాప్టర్స్‌పై ప్రత్యేక దృష్టి
మ్యాథ్స్‌లో 15 ఛాప్టర్స్ ఉంటాయి. అన్ని ఛాప్టర్స్‌కు వెయిటేజీ ఒకే విధంగా ఉండదు. నంబర్ సిస్టమ్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రెగనామెట్రీ, మెన్సురేషన్ వంటి ఛాప్టర్స్‌కు అధిక వెయిటేజీ ఉంటుంది. విద్యార్థులు ఈ ఛాప్టర్స్ పై ప్రిపరేషన్ సమయంలో ప్రత్యేకంగా దృష్టిసారించాల్సి ఉంటుంది. దీంతో మ్యాథ్స్‌లో ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్
ప్రిపరేషన్ సమయంలో మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా పరీక్షలో ప్రశ్నల రకాలు, పేపర్ మొత్తం స్ట్రక్చర్‌పై పూర్తి అవగాహన వస్తుంది. అంతేకాకుండా ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఏమైన మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది.
ఫార్ములా, థీరమ్స్ రివిజన్
ఫార్ములా, థీరమ్స్ సమర్థవంతంగా రివిజన్ చేయడానికి ఎప్పటికప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. కేవలం గుర్తుంచుకోవడానికి కాకుండా ప్రతి ఫార్ములా, సిద్ధాంతం వెనుక ఉన్న ప్రాథమిక సూత్రాలను గ్రహించడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల పరీక్ష సమయంలో ఫార్ములాలు, సిద్ధాంతాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి వీలుంటుంది.
పేపర్ ప్యాట్రన్‌ను అర్థం చేసుకోవాలి
పదోతరగతి ఎగ్జామ్ పేపర్ ప్యాట్రన్ అర్థం చేసుకోవడం ద్వారా మీ స్కిల్స్ మెరుగుపర్చుకోవచ్చు. మార్క్స్ డివిజన్, క్వశ్చన్ కేటగిరీలను అర్థం చేసుకోవడానికి ఇది బాగా ఉపయోపడుతుంది.
మ్యాథ్స్‌లో సాధారణంగా గుర్తించుకోవాల్సిన స్టాండర్డ్స్
టైప్-1: గుర్తుంచుకోవడం, అర్థం చేసుకోవడం ఆధారంగా (వెయిటేజీ 54 శాతం = 43 మార్కులు)
టైప్-2: అప్లైయింగ్ ఆధారంగా (వెయిటేజీ 24 శాతం = 19 మార్కులు)
టైప్-3: అనలైజింగ్, ఎవాల్యుయేషన్, క్రియేటింగ్ ఆధారంగా: (వెయిటేజీ 22 శాతం = 18 మార్కులు)
పైన పేర్కొన్న విధంగా ఫాలో అయితే ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది. త్వరగా సిలబస్ పూర్తిచేసే అవకాశం ఉంటుంది.
తగినంత విశ్రాంతి, పోషకాహారం
సబ్జెక్ట్‌కు సంబంధించిన అంశాలతో పాటు విద్యార్థి శారీరక, మానసిక ఆరోగ్యం కూడా ఎగ్జామ్ సమయంలో ఎంతో కీలకం. కాబట్టి విద్యార్థులు తగినంత విశ్రాంతి, పోషకమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. CBSE గణిత పరీక్ష 2023 విద్యార్థులకు ఎంతో కీలకమైంది. ఇది వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సమర్థవంతమైన స్ట్రాటజీ, టిప్స్ ఫాలో అవుతూ ప్రిపరేషన్ కొనసాగించండి. దీంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలా పరీక్షలో హై స్కోర్ సాధించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cbse exams, EDUCATION