హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IBPS PO: ఐబీపీఎస్‌లో బెస్ట్ స్కోరే మీ లక్ష్యమా.. ఈ టిప్స్ పాటిస్తే .. ఇట్టే జాబ్ కొట్టేస్తారు !

IBPS PO: ఐబీపీఎస్‌లో బెస్ట్ స్కోరే మీ లక్ష్యమా.. ఈ టిప్స్ పాటిస్తే .. ఇట్టే జాబ్ కొట్టేస్తారు !

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బ్యాంకింగ్(Banking) ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపట్టింది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS). ప్రొబేషనరీ ఆఫీసర్ల (PO) కోసం ఈ సంస్థ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ ఏడాదికి సంబంధించిన ఐబీపీఎస్ పీవో పరీక్షలు అక్టోబర్ 15, 16, 22వ తేదీల్లో జరగనున్నాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

బ్యాంకింగ్(Banking) ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపట్టింది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS). ప్రొబేషనరీ ఆఫీసర్ల (PO) కోసం ఈ సంస్థ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ ఏడాదికి సంబంధించిన ఐబీపీఎస్ పీవో పరీక్షలు అక్టోబర్ 15, 16, 22వ తేదీల్లో జరగనున్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఈసారి 6,432 ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఎగ్జామ్‌లో బెస్ట్ స్కోర్ కోసం సెక్షన్ల వారీగా పాటించాల్సిన టిప్స్ ఏవో తెలుసుకుందాం.

పరీక్ష విధానం

ఐబీపీఎస్ పీఓ (IBPS PO) ప్రిలిమ్స్ పరీక్ష మూడు సెక్షన్లు రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌గా ఉంటుంది. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. పరీక్ష(Exams) ఫార్మాట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ బేస్డ్‌గా ఉంటుంది. మెయిన్స్, ఇంటర్వ్యూకు అర్హత సాధించాలంటే ప్రిలిమ్స్‌లో మూడు సెక్షన్లలో కనీస కట్-ఆఫ్ మార్కులను స్కోర్ చేయడం తప్పనిసరి.

ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్‌లో మంచి స్కోర్ చేయడానికి సెక్షన్ వైజ్‌గా కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో పరిశీలిద్దాం.

రీజనింగ్ ఎబిలిటీ

గత కొన్ని సంవత్సరాల ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే.. రీజనింగ్ ఎబిలిటీలో స్క్వేర్ బేస్డ్ పజిల్ (ఇన్‌సైడ్ అండ్ ఔట్ సైడ్), బాక్స్ బేస్డ్ పజిల్, ఫ్లోర్-బేస్డ్ పజిల్, వర్డ్ అరేంజ్‌మెంట్ అండ్ నంబర్ పెయిరింగ్ వంటి వాటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ముందుగా పజిల్స్/సీటింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. పజిల్‌ను సాల్వ్ చేసేటప్పుడు లేదా సీటును ఎంపిక చేసుకునేటప్పుడు, ఒక వ్యక్తి లేదా వస్తువుకు ఒక షరతు కనెక్ట్ అయిందా, మరొక షరతు కూడా అదే వ్యక్తి లేదా వస్తువును సూచిస్తుందా వంటి వాటిని ప్రతి లొకేషన్‌లో నోట్ చేసుకుంటూ ఉండాలి. థియరీ అండ్ రీజనింగ్(Reasonings) విభాగాలను బాగా అర్థం చేసుకోవడానికి ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసే అలవాట్లను పెంపొందించుకోవాలి. ఈ విభాగాన్ని ప్రయత్నిస్తున్నప్పుడు ముందుగా దేన్ని ప్రయత్నించాలి అనే విషయాలను తెలుకోవడం చాలా ముఖ్యం.

ఇదీ చదవండి:  Raksha Bandhan:రక్షా బంధన్‌కి ఇలా ప్లాన్ చేయండి.. మీ సోదరి ఎంత సంతోషిస్తుందో తెలుసా !



క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

గత ప్రశ్న పత్రాలను గమనిస్తే ఈ సెక్షన్‌లో సింప్లికేషన్, అర్థమెటిక్ (%, SI, CI, నిష్పత్తి, వయసు, లాభం & నష్టం, మెన్సురేషన్, బోట్ & స్ట్రీమ్స్), క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ట్యాబులర్ అండ్ బార్ గ్రాఫ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో మంచి స్కోర్ సాధించాలంటే.. ముందుగా డేటా ఇంటర్‌ప్రిటేషన్ (DI)ను ప్రయత్నించాలి. ఆ తర్వాత నంబర్ సిరీస్ పై దృష్టిసారించాలి. ప్రిపరేషన్ సమయంలో మాక్ టెస్ట్‌లు ఎక్కువ సంఖ్యలో ప్రాక్టిస్ చేయాలి. దీంతో పరీక్షను వేగంగా, కచ్చితత్వంతో అటెమ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది.

ఇంగ్లిష్ లాంగ్వేజ్

ఐబీపీఎస్ పీఓ పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్‌‌లో మంచి స్కోర్ సాధించాలంటే కీలక టాఫిక్స్.. ఫిల్లర్ వర్డ్స్, రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్, క్లోజింగ్ ఎక్స్‌సర్‌సైజస్, ఎర్రర్ డిటెక్షన్, ఫ్రేజ్ రీఫ్లేస్‌మెంట్, జంబుల్డ్ ఫ్రేజ్, ఆడ్ వన్ ఔట్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టిసారించాలి. ఇంగ్లిష్ సెక్షన్‌లో బాగా స్కోర్ చేయాలంటే గ్రామర్ కీలకం. ఎర్రర్ స్పూటింగ్, ఫిల్లర్స్, క్లోజ్ టెస్ట్, ఫేజ్ రీప్లేస్‌మెంట్ వంటి వాటిని సాల్వ్ చేయడానికి గ్రామర్ బేసిక్ అంశాలపై దృష్టి పెట్టాలి. పర్యాయపదాలు, వ్యతిరేక పదాలు, స్పెల్లింగ్స్ వంటి తరచుగా అడిగే అంశాలను అర్థం చేసుకోవడంపై అభ్యర్థులు దృష్టి సారించాలి.

First published:

Tags: Banks, IBPS, Ibps clerks, JOBS