BEST SCHOLARSHIP PROGRAMS FOR STUDENTS KNOW APPLICATION DETAILS AND ELIGIBILITY EVK
Scholarship : విద్యార్థులకు గుడ్ న్యూస్.. బెస్ట్ స్కాలర్‌షిప్ ప్రొగ్రాంలు ఇవే.. దరఖాస్తు చేసుకోండి
స్కాలర్‌షిప్ ప్రొగ్రాం
కరోనా కారణంగా చాలా మంద విద్యార్థులు (Students) ఆర్థిక సమస్యల కారణంగా చదువుకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఆర్థిక చేయూత నిచ్చేందుకు పలు స్కాలర్‌షిప్‌లు (Scholarship) అందుబాటులో ఉన్నాయి. ఆ స్కాలర్‌షిప్ వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
కరోనా కారణంగా చాలా మంద విద్యార్థులు ఆర్థిక సమస్యల కారణంగా చదువుకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఆర్థిక చేయూత నిచ్చేందుకు పలు స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో విద్యార్థుల చదువు ఆటంకం కలుగకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి మంచి స్కాలర్‌షిప్ (Scholarship) ప్రొగ్రాంలు విద్యార్థుల కెరీర్‌కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే కొంత ఫీజుతో కొంత కోర్సు లేదా ప్రోగ్రామ్ (Program) ని అభ్యసించడానికి వీలు కల్పిస్తుంది. కోవిడ్ కారణంగా ఎంతో మంది తల్లిదండ్రులను కోల్పోయారు. కుటుంబం పెద్ద ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఇబ్బంది పడే వారు దరఖాస్తు చేసుకోవాల్సిన స్కాలర్‌షిప్ వివరాలు తెలుసుకోండి.
బీవైపీఎస్ సశక్త్ స్కాలర్‌షిప్..
బీఎస్ఈఎస్ యమునా పవర్‌లిమిటెడ్ (BSES Yamuna Power Limited) ఢిల్లీలోని ప్రభుత్వ సంస్థల్లో అండర్ గ్రాడ్యయేట్ ప్రోగ్రామ్‌లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల నుంచి స్కాలర్‌షిప్ పొందాలనుకొనే వారి నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఎక్కువగా వెనుకబడిన వర్గాల వారికి లబ్ధి చేకూకుతుందని సంస్థ పేర్కొంది.
అర్హతలు..
- కేవలం భారతీయ విద్యార్థులకు మాత్రమే.. ఢిల్లీలో నివసిస్తూ ఉండాలి.
- అండర్ గ్రాడ్యుయేట్‌లో చివరి సంవత్సరం చదువుతున్న వారికి మాత్రమే.
- ముందు విద్యా సంవత్సరంలో 55శాతం మార్కులు పొంది ఉండాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం రూ.6లక్షలు మించి ఉండకూడదు.
- ప్రైజ్‌లు రివార్డులు రూ.3లక్షల వరకు ఉండవచ్చు.
Step 7 : అవసరమైన డాక్యుమెంట్లు పూర్తిగా అందించాలి.
ఎన్ఎస్‌పీ సెంట్రల్ సెక్టర్ స్కాలర్‌షిప్..
పన్నెండో తరగతి పూర్తి చేసుకొన్న విద్యార్థులకు ఎన్ఎస్‌పీ సెంట్రల్ సెక్టర్ స్కాలర్‌షిప్ (NSP Central Sector Scheme of Scholarship) చక్కని అవకాశం కల్పిస్తోంది. విద్యార్థులు పన్నెండో తరగతి పూర్తి చేసుకొని మంచి మార్కులు సాధించి ఆర్థికంగా చదవలేని స్థితిలో ఉన్నవారు ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు..
- 12వ తరగతిలో 80శాతం మార్కులుసాధించి ఉండాలి.
- అభ్యర్థులు AICTE, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DCI), మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI) లేదా ఇతర గుర్తింపు పొందిన సంస్థల కళాశాలలో కోర్సును అభ్యసిస్తూ ఉండాలి.
- ఇతర స్కాలర్‌షిప్‌లు పొందే వారు అర్హులు కారు.
- కుటంబ ఆదాయం రూ.8లక్షలు మించి ఉండకూడదు.
- అవార్డులు,రివార్డులు సంవత్సరానికి రూ.10,000ల నుంచి రూ.20,000 వరకు ఉండొచ్చు.
Step 3 : పూర్తి వివరాలు చదివి స్కాలర్‌షిప్ కోసం Register చేసుకోవాలి.
Step 4 : దరఖాస్తుకు నవంబర్ 30, 2021 వరకు అవకాశం ఉంది.
టాటా క్యాపిటల్ పంఖ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్
ఈ స్కాలర్‌షిప్‌కు ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు అర్హలు. అంతే కాకుండా అండ్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేసేవారు కూడా అర్హులు. వారు ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు..
- ఇది భారతీయులకు మాత్రమే వర్తించే స్కాలర్‌షిప్
- రో తరగతి నుంచి 12వ తరగతి చదివేవారు, పాల్‌టెక్నిక్, డిప్లమా, అండర్‌గ్రాడ్యుయేట్లు అప్లె చేసుకోవచ్చు.
- అకాడమిక్‌లో 60శాతం మార్కులు వచ్చి ఉండాలి.
- కుటంబ వార్షిక ఆదాయం రూ.4లక్షలు మించి ఉండకూడదు.
- కోవిడ్ 19 ఏ రకంగా ఇబ్బంది పడ్డ అందుకు తగిన ధ్రువపత్రాలు సమర్పించాలి.
- పరీక్ష ఫీజులో, ట్యూషన్‌ఫీజులో 80శాతం వరకు స్కాలర్‌షిప్ భరిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.