Scholarship : అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోండి.. విద్యార్థుల‌కు బెస్ట్ స్కాల‌ర్‌షిప్ ప్రొగ్రాంలు

(ప్రతీకాత్మక చిత్రం)

Scholarships 2021 : క‌రోనా కార‌ణంగా చాలా మంద విద్యార్థులు ఆర్థిక స‌మ‌స్య‌ల కార‌ణంగా చ‌దువుకు దూర‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో వారికి ఆర్థిక చేయూత నిచ్చేందుకు ప‌లు స్కాల‌ర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి క్లిష్ట స‌మ‌యంలో విద్యార్థుల చ‌దువు ఆటంకం క‌లుగ‌కుండా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

  • Share this:
    క‌రోనా కార‌ణంగా చాలా మంద విద్యార్థులు ఆర్థిక స‌మ‌స్య‌ల కార‌ణంగా చ‌దువుకు దూర‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో వారికి ఆర్థిక చేయూత నిచ్చేందుకు ప‌లు స్కాల‌ర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి క్లిష్ట స‌మ‌యంలో విద్యార్థుల చ‌దువు ఆటంకం క‌లుగ‌కుండా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి మంచి స్కాల‌ర్‌షిప్ (Scholarship) ప్రొగ్రాంలు విద్యార్థుల కెరీర్‌కు ఎంతో ఉప‌యుక్తంగా ఉంటుంది. అలాగే కొంత ఫీజుతో కొంత కోర్సు లేదా ప్రోగ్రామ్‌ (Program) ని అభ్యసించడానికి వీలు కల్పిస్తుంది. కోవిడ్ కార‌ణంగా ఎంతో మంది త‌ల్లిదండ్రులను కోల్పోయారు. కుటుంబం పెద్ద ఉపాధి కోల్పోయి ఇబ్బంది ప‌డుతున్నారు. ఇలా ఇబ్బంది ప‌డే వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన స్కాల‌ర్‌షిప్ వివ‌రాలు తెలుసుకోండి.

    బీవైపీఎస్ స‌శ‌క్త్ స్కాల‌ర్‌షిప్‌..

    బీఎస్ఈఎస్ య‌మునా ప‌వ‌ర్‌లిమిటెడ్ (BSES Yamuna Power Limited) ఢిల్లీలోని ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో అండ‌ర్ గ్రాడ్య‌యేట్ ప్రోగ్రామ్‌లో చివరి సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థుల నుంచి స్కాల‌ర్‌షిప్ పొందాల‌నుకొనే వారి నుంచి సంస్థ ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ స్కాల‌ర్‌షిప్ ద్వారా ఎక్కువ‌గా వెనుక‌బ‌డిన వ‌ర్గాల వారికి ల‌బ్ధి చేకూకుతుంద‌ని సంస్థ పేర్కొంది.

    అర్హ‌త‌లు..
    - కేవలం భార‌తీయ విద్యార్థులకు మాత్ర‌మే.. ఢిల్లీలో నివ‌సిస్తూ ఉండాలి.
    - అండ‌ర్ గ్రాడ్యుయేట్‌లో చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతున్న వారికి మాత్ర‌మే.
    - ముందు విద్యా సంవ‌త్స‌రంలో 55శాతం మార్కులు పొంది ఉండాలి.
    - కుటుంబ వార్షిక ఆదాయం రూ.6ల‌క్ష‌లు మించి ఉండ‌కూడ‌దు.
    - ప్రైజ్‌లు రివార్డులు రూ.3లక్ష‌ల వ‌ర‌కు ఉండవ‌చ్చు.

    CBSE Exams : విద్యార్థుల శ్రేయ‌స్సే ముఖ్యం.. శీతాకాలం.. క‌రోనా.. దృష్టిలో పెట్టుకొని సీబీఎస్ఈ డేట్‌షీట్ విడుద‌ల‌


     ద‌ర‌ఖాస్తు చేసే విధానం..

    Step 1 : ఈ స్కాల‌ర్‌షిప్‌కు కేవ‌లం ఆన్‌లైన్ ద్వారానే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

    Step 2 : ముందుగా https://www.buddy4study.com/scholarships వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి.

    Step 3 : రిజిస్ట్రేష‌న్ పూర్తి చేసిన త‌రువాత హెచ్‌డీఎఫ్‌సీ ప‌రివ‌ర్త‌న్ కోవిడ్ కోర్సుల లింక్‌లోకి వెళ్లాలి.

    Step 4 : హెచ్‌డీఎఫ్‌సీ ప‌రివ‌ర్త‌న్ కోవిడ్ కోర్సు లింక్
    https://www.buddy4study.com/page/bypl-sashakt-scholarship

    Step 5 : ద‌ర‌ఖాస్తు ఫాం పూర్తిగా నింపాలి.

    Step 6 : స్టార్ట్ బ‌ట‌న్ నొక్క‌డం ద్వారా అప్లికేష‌న్ ఫాంలో అడిగిన వివ‌రాలు అందించాలి.

    Step 7 : అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు పూర్తిగా అందించాలి.

    ఎన్ఎస్‌పీ సెంట్ర‌ల్ సెక్ట‌ర్ స్కాల‌ర్‌షిప్‌..

    ప‌న్నెండో త‌ర‌గ‌తి పూర్తి చేసుకొన్న విద్యార్థుల‌కు ఎన్ఎస్‌పీ సెంట్ర‌ల్ సెక్ట‌ర్ స్కాల‌ర్‌షిప్ (NSP Central Sector Scheme of Scholarship) చ‌క్క‌ని అవ‌కాశం క‌ల్పిస్తోంది. విద్యార్థులు ప‌న్నెండో త‌ర‌గ‌తి పూర్తి చేసుకొని మంచి మార్కులు సాధించి ఆర్థికంగా చ‌ద‌వ‌లేని స్థితిలో ఉన్న‌వారు ఈ స్కాల‌ర్షిప్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

    Telangana Jobs : యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో మెడిక‌ల్ స్టాఫ్ ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌


    అర్హ‌త‌లు..

    - 12వ త‌ర‌గ‌తిలో 80శాతం మార్కులుసాధించి ఉండాలి.
    - అభ్యర్థులు AICTE, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DCI), మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI) లేదా ఇతర గుర్తింపు పొందిన సంస్థ‌ల క‌ళాశాల‌లో కోర్సును అభ్య‌సిస్తూ ఉండాలి.
    - ఇత‌ర స్కాల‌ర్‌షిప్‌లు పొందే వారు అర్హులు కారు.
    - కుటంబ ఆదాయం రూ.8ల‌క్ష‌లు మించి ఉండ‌కూడ‌దు.
    - అవార్డులు,రివార్డులు సంవ‌త్స‌రానికి రూ.10,000ల నుంచి రూ.20,000 వ‌ర‌కు ఉండొచ్చు.

    ద‌ర‌ఖాస్తు విధానం. .

    Step 1 :  ద‌ర‌ఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.

    Step 2 :  ముందుగా అభ్య‌ర్థి అధికారిక లింక్ https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction ను సంద‌ర్శించాలి.

    Step 3 :  పూర్తి వివ‌రాలు చ‌దివి స్కాల‌ర్‌షిప్ కోసం Register చేసుకోవాలి.

    Step 4 :  ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 30, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    SBI జనరల్ సురక్ష సపోర్ట్ స్కాలర్‌షిప్

    క‌రోనా మహమ్మారి (Covid-19 pandemic)కారణంగా వేలాది మంది పిల్లలు నిరాశ్రయులయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారి చదువు, భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అటువంటి పిల్లలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) SBI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా వారికి చేయూత నందించేందుకు స్కాల‌ర్‌షిప్ ప్రొగ్రాంను అందిస్తున్నారు.

    ముఖ్య స‌మాచారం..



























    స్కాల‌ర్‌షిప్ పేరు SBI జనరల్ సురక్ష సపోర్ట్ స్కాలర్‌షిప్
    స్కాల‌ర్‌షిప్ అందించే వారు SBI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
    అర్హ‌త‌ కోవిడ్ కార‌ణంగా ప్రభావితమైన‌ 9 నుంచి 12 తరగతి, గ్రాడ్యుయేషన్ చ‌దువుతున్న విద్యార్థులు.
    స్కాల‌ర్‌షిప్ వివ‌రాలు.. - 9 నుంచి 12 త‌ర‌గ‌తి చ‌దువుతున్న వారికి రూ.29,500
    - గ్రాడ్యుయేష‌న్ చేస్తున్న వారికి రూ.38,500
    ద‌ర‌ఖాస్తుకు చివరి తేదీ అక్టోబ‌ర్ 31, 2021
    అధికారిక వెబ్‌సైట్‌ https://www.buddy4study.com/page/sbi-general-suraksha-support-scholarship-program

    ఎంపిక విధానం..
    ఎస్‌బిఐ జనరల్ సురక్ష సపోర్ట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కోసం అభ్యర్థులను అకడమిక్ మెరిట్సా, సామాజిక-ఆర్థిక నేపథ్యం ఆధారంగా ఎంపిక చేస్తారు.

    Step 1 :  ముందుగా దరఖాస్తుదారుల అకడమిక్ మెరిట్, ఆర్థిక నేపథ్యం ప‌రిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు.

    Step 2 :  ఎంపికైన అభ్యర్థులను టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేస్తారు.

    Step 3 :  అన‌త‌రం డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఎంపిక చేస్తారు.

    ద‌ర‌ఖాస్తుకు అవ‌స‌ర‌మై డాక్యుమెంట్లు..
    - పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డు
    - కుటుంబ పెద్ద‌ జీతం స్లిప్, ఫారం 16, ఆదాయ ధ్రువీక‌ర‌ణ‌ పత్రం
    - విద్యార్థి మునుపటి విద్యా అర్హత యొక్క మార్క్ షీట్
    - ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రవేశ రుజువు (ఫీజు రసీదు/ప్రవేశ లేఖ/సంస్థ గుర్తింపు కార్డు/బోనఫైడ్ సర్టిఫికేట్)
    - కోవిడ్ సంక్ష‌భం రుజువు (కుటుంబ పెద్ద‌ మరణ ధ్రువీకరణ పత్రం లేదా ఉద్యోగం కోల్పోయిన రుజువు)
    - స్కాలర్‌షిప్ దరఖాస్తుదారు లేదా తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతా వివరాలు (రద్దు చేసిన చెక్/పాస్‌బుక్ కాపీ)

    ద‌ర‌ఖాస్తు చేసే విధానం..

    Step 1 : ఈ స్కాల‌ర్‌షిప్‌కు కేవ‌లం ఆన్‌లైన్ ద్వారానే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

    Step 2 : ముందుగా https://www.buddy4study.com/scholarships వెబ్‌సైట్‌లో రిజిస్ట‌ర్ చేసుకోవాలి.

    Step 3 : రిజిస్ట్రేష‌న్ పూర్తి చేసిన త‌రువాత హెచ్‌డీఎఫ్‌సీ ప‌రివ‌ర్త‌న్ కోవిడ్ కోర్సుల లింక్‌లోకి వెళ్లాలి.

    Step 4 : ఎస్‌బీఐ (SBI) జనరల్ సురక్ష సపోర్ట్ స్కాలర్‌షిప్ లింక్‌లోకి వెళ్లాలి.
    https://www.buddy4study.com/page/sbi-general-suraksha-support-scholarship-program

    Step 5 : ద‌ర‌ఖాస్తు ఫాం పూర్తిగా నింపాలి.

    Step 6 : స్టార్ట్ బ‌ట‌న్ నొక్క‌డం ద్వారా అప్లికేష‌న్ ఫాంలో అడిగిన వివ‌రాలు అందించాలి.

    Step 7 : అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు పూర్తిగా అందించాలి.
    Published by:Sharath Chandra
    First published: