హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SBI Scholarship : విద్యార్థుల‌కు ఎస్‌బీఐ చేయూత‌.. రూ.38,500 స్కాల‌ర్‌షిప్‌ అందుకోవ‌చ్చు

SBI Scholarship : విద్యార్థుల‌కు ఎస్‌బీఐ చేయూత‌.. రూ.38,500 స్కాల‌ర్‌షిప్‌ అందుకోవ‌చ్చు

ఎస్‌బిఐ జనరల్ సురక్ష సపోర్ట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్

ఎస్‌బిఐ జనరల్ సురక్ష సపోర్ట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్

క‌రోనా కార‌ణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారి చదువు, భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అటువంటి పిల్లలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) SBI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా వారికి చేయూత నందించేందుకు స్కాల‌ర్‌షిప్ (Scholarship) ప్రొగ్రాంను అందిస్తున్నారు.

ఇంకా చదవండి ...

  క‌రోనా మహమ్మారి (Covid-19 pandemic)కారణంగా వేలాది మంది పిల్లలు నిరాశ్రయులయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారి చదువు, భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అటువంటి పిల్లలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) SBI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా వారికి చేయూత నందించేందుకు స్కాల‌ర్‌షిప్ ప్రొగ్రాంను అందిస్తున్నారు. ఆ కార్య‌క్ర‌మం పేరు SBI జనరల్ సురక్ష సపోర్ట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్. క‌రోనా కార‌ణంగా త‌ల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారు. జీవ‌నోపాధి కోల్పోయిన కుటుంబ విద్యార్థుల‌కు ఈ స్కాల‌ర్‌షిప్‌ను అందించ‌నున్నారు. ఈ స్కాల‌ర్‌షిప్‌ (Scholarship) కు ఎంపికైన వారికి విభాగాల వారీగా రూ.29,500 నుంచి రూ.38,500 వ‌ర‌కు రివార్డు అందించ‌నున్నారు. ఈ స్కాల‌ర్‌షిప్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం అర్హ‌త‌లు తెలుసుకోండి.

  ముఖ్య స‌మాచారం..

  స్కాల‌ర్‌షిప్ పేరుSBI జనరల్ సురక్ష సపోర్ట్ స్కాలర్‌షిప్
  స్కాల‌ర్‌షిప్ అందించే వారుSBI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
  అర్హ‌త‌కోవిడ్ కార‌ణంగా ప్రభావితమైన‌ 9 నుంచి 12 తరగతి, గ్రాడ్యుయేషన్ చ‌దువుతున్న విద్యార్థులు.
  స్కాల‌ర్‌షిప్ వివ‌రాలు..- 9 నుంచి 12 త‌ర‌గ‌తి చ‌దువుతున్న వారికి రూ.29,500- గ్రాడ్యుయేష‌న్ చేస్తున్న వారికి రూ.38,500
  ద‌ర‌ఖాస్తుకు చివరి తేదీఅక్టోబ‌ర్ 31, 2021
  అధికారిక వెబ్‌సైట్‌https://www.buddy4study.com/page/sbi-general-suraksha-support-scholarship-program


  ఎంపిక విధానం..

  ఎస్‌బిఐ జనరల్ సురక్ష సపోర్ట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కోసం అభ్యర్థులను అకడమిక్ మెరిట్సా, సామాజిక-ఆర్థిక నేపథ్యం ఆధారంగా ఎంపిక చేస్తారు.

  Step 1 :  ముందుగా దరఖాస్తుదారుల అకడమిక్ మెరిట్, ఆర్థిక నేపథ్యం ప‌రిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు.

  IIM Admissions : "క్యాట్" లేకున్నా.. ఐఐఎంలో సీట్ పొంద‌వచ్చు.. ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఇవే


  Step 2 :  ఎంపికైన అభ్యర్థులను టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేస్తారు.

  Step 3 :  అన‌త‌రం డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఎంపిక చేస్తారు.

  ద‌ర‌ఖాస్తుకు అవ‌స‌ర‌మై డాక్యుమెంట్లు..

  - పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డు

  - కుటుంబ పెద్ద‌ జీతం స్లిప్, ఫారం 16, ఆదాయ ధ్రువీక‌ర‌ణ‌ పత్రం

  - విద్యార్థి మునుపటి విద్యా అర్హత యొక్క మార్క్ షీట్

  - ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రవేశ రుజువు (ఫీజు రసీదు/ప్రవేశ లేఖ/సంస్థ గుర్తింపు కార్డు/బోనఫైడ్ సర్టిఫికేట్)

  - కోవిడ్ సంక్ష‌భం రుజువు (కుటుంబ పెద్ద‌ మరణ ధ్రువీకరణ పత్రం లేదా ఉద్యోగం కోల్పోయిన రుజువు)

  - స్కాలర్‌షిప్ దరఖాస్తుదారు లేదా తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతా వివరాలు (రద్దు చేసిన చెక్/పాస్‌బుక్ కాపీ)

  ద‌ర‌ఖాస్తు చేసే విధానం..

  Step 1 : ఈ స్కాల‌ర్‌షిప్‌కు కేవ‌లం ఆన్‌లైన్ ద్వారానే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

  Step 2 : ముందుగా https://www.buddy4study.com/scholarships వెబ్‌సైట్‌లో రిజిస్ట‌ర్ చేసుకోవాలి.

  Step 3 : రిజిస్ట్రేష‌న్ పూర్తి చేసిన త‌రువాత హెచ్‌డీఎఫ్‌సీ ప‌రివ‌ర్త‌న్ కోవిడ్ కోర్సుల లింక్‌లోకి వెళ్లాలి.

  Step 4 : ఎస్‌బీఐ (SBI) జనరల్ సురక్ష సపోర్ట్ స్కాలర్‌షిప్ లింక్‌లోకి వెళ్లాలి.

  https://www.buddy4study.com/page/sbi-general-suraksha-support-scholarship-program

  Step 5 : ద‌ర‌ఖాస్తు ఫాం పూర్తిగా నింపాలి.

  Step 6 : స్టార్ట్ బ‌ట‌న్ నొక్క‌డం ద్వారా అప్లికేష‌న్ ఫాంలో అడిగిన వివ‌రాలు అందించాలి.

  Step 7 : అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు పూర్తిగా అందించాలి.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: EDUCATION, Insurence, Sbi, Scholarships, State bank of india, Students

  ఉత్తమ కథలు