Home /News /jobs /

BEST ENGINEERING COLLEGES IN INDIA WHICH ACCEPTS JEE SCORE FOR ADMISSIONS KNOW FULL DETAILS HERE VB

Best Engineering Colleges: ఇంజనీరింగ్ లో ప్రవేశానికి.. దేశంలోని అత్యుత్తమ కళాశాలలు ఇవే..

Best Engineering Colleges: ఇంజనీరింగ్ లో ప్రవేశానికి.. దేశంలోని అత్యుత్తమ కళాశాలలు ఇవే..

Best Engineering Colleges: ఇంజనీరింగ్ లో ప్రవేశానికి.. దేశంలోని అత్యుత్తమ కళాశాలలు ఇవే..

Best Engineering Colleges: జేఈఈ మెయిన్స్(JEE Mains) అత్యంత కష్టతరమైన , ప్రతిష్టాత్మకమైన ఇంజినీరింగ్(Engineering) ప్రవేశ పరీక్షగా పరిగణించబడుతుంది. JEE మెయిన్స్ 2022 భారతదేశంలోని ప్రసిద్ధ ఇంజనీరింగ్ కళాశాలలకు గేట్‌వేగా ఉపయోగపడుతుందని భావిస్తారు.

ఇంకా చదవండి ...
జేఈఈ మెయిన్స్(JEE Mains) అత్యంత కష్టతరమైన , ప్రతిష్టాత్మకమైన ఇంజినీరింగ్(Engineering) ప్రవేశ పరీక్షగా పరిగణించబడుతుంది. JEE మెయిన్స్ 2022 భారతదేశంలోని ప్రసిద్ధ ఇంజనీరింగ్ కళాశాలలకు గేట్‌వేగా ఉపయోగపడుతుందని భావిస్తారు. చాలా తక్కువ మంది విద్యార్థులు(Students) పరీక్షలలో మంచి మార్కులు పొందడంలో విజయం సాధిస్తారు. ప్రశ్నలు చాలా కష్టంగా ఉండటంతో.. చాలా తక్కువ మందికి ఎక్కువ మార్కులు పొంది NIT లేదా IITలో ప్రవేశం పొందుతారు. అయితే జేఈఈలో మంచి ర్యాంక్ సాధించిన వారికి ఏ కాలేజీలో ప్రవేశం పొందాలో తెలియదు. వారి కోసం.. దేశంలో ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి ఐఐటి(IIT) కంటే మెరుగైన కళాశాలలు ఏమున్నాయో తెలుసుకుందాం..

SCR Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్ నుంచి వెళ్లే పలు రైళ్లు రద్దు..


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT), తిరుచిరాపల్లి
ఈ ఇన్‌స్టిట్యూట్ భారతదేశంలోని ఇంజినీరింగ్ ఆశావాదులకు ప్రసిద్ధి చెందిన ఇన్‌స్టిట్యూట్‌లలో ఒకటి అని చెప్పవచ్చు. ఇన్‌స్టిట్యూట్ అందించే 61 ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా JEE మెయిన్స్‌లో అర్హత పొందాలి.

బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(BITS)
ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన ఇంజినీరింగ్ సంస్థ. వివిధ ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికి JEE మెయిన్స్ స్కోర్‌ అనేది చాలా ముఖ్యం. దీనిలో సీటు సాధించాలంటే.. జేఈఈలో మంచి ర్యాంక్ సాధించాల్సి ఉంటుంది. భారతదేశంలోని పురాతన ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలలో ఒకటి.



విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాగ్‌పూర్
నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ప్రసిద్ధ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాలంటే, విద్యార్థులు JEE ప్రధాన ప్రవేశ పరీక్షలో 360 మార్కులకు 120 కంటే ఎక్కువ మార్కులు పొందాలి.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కెలా


ఫ్యాకల్టీ , ప్లేస్‌మెంట్ అవకాశాల పరంగా మెకానికల్ ఇంజనీరింగ్ ది అత్యుత్తమవైన కోర్సు. ఈ కాలేజీలో ఇంజనీరింగ్ చేయాలంటే.. జేఈఈలో మంచి స్కోర్ సాధించాలి.

కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, పూణే


ఇది 1854లో స్థాపించబడిన స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ , మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులు ఇక్కడ ఉత్తమ కోర్సులుగా పరిగణించబడతాయి. జేఈఈ మెయిన్స్ స్కోర్ ఆధారంగా దీనిలో సీటు సాధించవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Engineering, Jee main 2022, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు