Ciné Impact Film Fellowship 2021 : ఫిల్మ్‌మేక‌ర్‌ల‌కు మంచి అవ‌కాశం.. ఫిల్మ్ ఫెలోషిప్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోండి

Ciné ఇంపాక్ట్ ఫిల్మ్ ఫెలోషిప్ 2021

Film Fellowship 2021 : ఫిల్మ్ మేకింగ్ (Film Making) మీద ఆస‌క్తి ఉన్న వారికి స‌ద‌వ‌కాశం ఎదురుచూస్తోంది. సామాజిక స‌మ‌స్య‌ల‌పై క‌థా, క‌థ‌నాలు రాసి చ‌క్క‌ని ప్ర‌తిభ క‌లిగిన ఫిల్మ్‌మేకర్లను గుర్తించేందుకు ఇండియాసిఎస్ఆర్‌తో కలిసి హైఫెన్ Ciné ఇంపాక్ట్ ఫిల్మ్ ఫెలోషిప్ 2021ను అందిస్తోంది. ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 15, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

  • Share this:
    ఫిల్మ్ మేకింగ్ (Film Making) మీద ఆస‌క్తి ఉన్న వారికి స‌ద‌వ‌కాశం ఎదురుచూస్తోంది. సామాజిక స‌మ‌స్య‌ల‌పై క‌థా, క‌థ‌నాలు రాసి చ‌క్క‌ని ప్ర‌తిభ క‌లిగిన ఫిల్మ్‌మేకర్లను గుర్తించేందుకు ఇండియాసిఎస్ఆర్‌తో కలిసి హైఫెన్ Ciné ఇంపాక్ట్ ఫిల్మ్ ఫెలోషిప్ 2021ను అందిస్తోంది. ఆస‌క్తి ఉన్నవారు ఈ ఫిల్మ్ ఫెలోషిప్ ద్వారా త‌మ ప్ర‌తిభ‌కు మ‌రింత ప‌దును పెట్టుకోవ‌చ్చు. ఈ ఫెలోషిప్ (Fellowship) కోర్సు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారి గ‌రిష్ట వ‌య‌సు 25 ఏళ్లు మించ‌కూడ‌దు. అంతే కాకుండా ద‌ర‌ఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్‌ (online)లోనే ఉంటుంది. ఈ ఫెలోషిప్‌లో ఫిల్మ్ మేకింగ్ రూ.ల‌క్ష గ్రాంట్ అందిస్తారు. అంతే కాకుండా అవార్డు ప్రైజ్ కింద మ‌రో రూ.ల‌క్ష వ‌ర‌కు అందుతుంది. పూర్తి వివ‌రాల కోసం అధికారి వెబ్‌సైట్‌ https://thehyphen.in/cine-impact/ ను సంద‌ర్శించాలి.

    ఫెలోషిప్ వివ‌రాలు..

    Step 1 :  NGO లు మరియు కార్పొరేట్‌ (Corporate) ల ద్వారా నిర్వహించబడే కమ్యూనిటీ కార్యక్రమాలపై చిత్రాలను రూపొందించడానికి జట్లకు రెండు నెలల సమయం ఇస్తారు.

    Step 2 :  టీమ్ సభ్యుల‌తో మంచి డాక్యుమెంట్‌ (Documents)ను ఫెలోషిప్‌లో అందించాలి.

    Step 3 :  చిత్రం సామాజిక-ఆర్థిక సమస్యలను స్రృషిస్తూ వివ‌ర‌ణాత్మ‌కంగా ఉండాలి.

    Career Guidance : షార్ట్ ట‌ర్మ్ కోర్సుల‌తో.. లాంగ్ ట‌ర్మ్ కెరీర్‌


     Step 4 :  ప్రతి చిత్రం సామాజిక, ఆర్థిక లేదా సాంస్కృతిక - విభిన్న అంశాలను అన్వేషిదిగా ఉండాలి.


    బహుమతులు మరియు రివార్డులు:
    - ఫిల్మ్ మేకింగ్ గ్రాంట్ రూ. 1,00,000 వరకు
    - రూ.1,00,000 విలువైన నగదు బహుమతులు
    - ఫిల్మ్ మేకింగ్ బూట్‌క్యాంప్ అండ్ మెంటర్‌షిప్ ల‌భిస్తుంది.

    ఎంపిక విధానం..

    Step 1 :  ముందుగా అభ్య‌ర్థి నుంచి సెప్టెంబ‌ర్ 15, 2021 నుంచి అక్టోబ‌ర్ 15, 2021 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.

    Step 2 :  న‌వంబ‌ర్ 1, 2021న ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్ట్ (Short list) చేస్తారు.

    Step 3 :  న‌వంబ‌ర్ 8, 2021 వ‌ర‌కు బూట్ క్యాంప్ నిర్వ‌హిస్తారు.

    Step 4 :  న‌వంబ‌ర్ 15, 2021 వ‌ర‌కు ఫిల్మ్‌మేకింగ్ ప్రారంభ‌మ‌వుతుంది.

    Step 5 :  ఫిబ్ర‌వ‌రి 15, 2021 వ‌ర‌కు ఫిల్మ్ తుది స‌బ్మిష‌న్ (Submission) చేయాలి.

    Step 6 :  ఫిబ్ర‌వ‌రి 20, 2021న గ్రాండ్ ఫైన‌ల్ ఉంటుంది.

    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 :  పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

    Step 2 :  ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://thehyphen.in/cine-impact/ ను సంద‌ర్శించాలి.

    Step 3 :  పార్టిసిపెంట్ ఆప్ష‌న్‌మీద క్లిక్ చేసి పూర్తి వివ‌రాలు అందించాలి.

    Step 4 :  ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 25, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published: