హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Best B-School: ఎగ్జిక్యూటివ్ కోర్సులకు బెస్ట్ B-స్కూల్ IIM అహ్మదాబాద్.. టాప్-50లో ఉన్న ఇన్‌స్టిట్యూషన్స్ ఇవే..

Best B-School: ఎగ్జిక్యూటివ్ కోర్సులకు బెస్ట్ B-స్కూల్ IIM అహ్మదాబాద్.. టాప్-50లో ఉన్న ఇన్‌స్టిట్యూషన్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బిజినెస్ స్ట్రీమ్‌లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ విషయంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌లు ప్రపంచ వ్యాప్తంగా ముందుంటున్నాయని ఫైనాన్షియల్ టైమ్ ర్యాంకింగ్స్ స్పష్టం చేశాయి. ఈ విభాగంలో మూడు ఇండియన్‌ IIMలు గ్లోబల్ టాప్ 100 కాలేజీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

ఇంకా చదవండి ...

బిజినెస్ స్ట్రీమ్‌లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్(Education) విషయంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌లు(Indian Institutes) ప్రపంచ వ్యాప్తంగా ముందుంటున్నాయని ఫైనాన్షియల్ టైమ్ ర్యాంకింగ్స్(Rankings) స్పష్టం చేశాయి. ఈ విభాగంలో మూడు ఇండియన్‌ IIMలు గ్లోబల్ టాప్ 100 కాలేజీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ లిస్ట్‌లో ఐఐఎం అహ్మదాబాద్(IIM Ahmadabad) 39వ స్థానంలో ఉంది. ఈ సంస్థతో పాటు IIM- బెంగళూరు ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 ఇన్‌స్టిట్యూట్‌ల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. కస్టమ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, ఓపెన్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అనే రెండు స్ట్రీమ్స్‌లో టాప్ 50 బిజినెస్ స్కూల్స్ జాబితాను ఫైనాన్షియల్ టైమ్స్ రూపొందించింది. ఇందులో టాప్ 50లో రెండు భారత విద్యా సంస్థలు ఉన్నాయి. IIM అహ్మదాబాద్ 39వ ర్యాంక్ సాధించగా, IIM బెంగళూరు 45వ ర్యాంక్ సాధించాయి.

ఓపెన్, కస్టమ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ఇండివిడ్యువల్ కేటగిరీస్‌లో ఇండియన్ B-స్కూల్స్ సంఖ్య ఎక్కువగా ఉంది. ఓపెన్ కేటగిరీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్‌లో ఇండియా నుంచి IIM-A టాప్ ర్యాంక్‌ను కొనసాగించింది. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్ ర్యాంకింగ్ 2022లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ 28వ ర్యాంకు సాధించింది. ఈ జాబితాలో IIM బెంగళూరు 43వ ర్యాంక్, ఐఐఎం అహ్మదాబాద్ 50వ ర్యాంక్ సాధించాయి.

2021లో నామినేట్ చేసిన మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లను పూర్తి చేసిన కోర్సు ప్రొవైడర్లు, వ్యక్తుల నుంచి డేటాను ఉపయోగించి ఓపెన్ కేటగిరీ జాబితాను రూపొందించారు. పార్టిసిపెంట్స్ క్వాలిటీ, బోధన, ఇతర పాయింట్లతో పాటు వారి నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకున్నారు.

Govt Scheme: ఆ స్కీమ్‌లో ఉన్నవారికి అలర్ట్... మే 31 లాస్ట్ డేట్

* FT ర్యాంకింగ్ 2022: గ్లోబల్ టాప్ 10 ఇన్‌స్టిట్యూట్స్

FT ర్యాంకింగ్స్ ప్రకారం రెండు జాబితాలను కలిపి చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోసం టాప్ 10 B-స్కూల్స్ ఇవే

ర్యాంక్ 1: HEC పారిస్

ర్యాంక్ 2: Iese బిజినెస్ స్కూల్

ర్యాంక్ 3: IMD బిజినెస్ స్కూల్

ర్యాంక్ 4: Esade బిజినెస్ స్కూల్

ర్యాంక్ 5: లండన్ బిజినెస్ స్కూల్

ర్యాంక్ 6: Essec బిజినెస్ స్కూల్

ర్యాంక్ 7: SDA బోకోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్

ర్యాంక్ 8: యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్: రాస్

ర్యాంక్ 9: ఫండాకో డోమ్ కాబ్రాల్

ర్యాంక్ 10: Edhec బిజినెస్ స్కూల్

IIMB ప్రొఫెసర్, మార్కెటింగ్, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ల చైర్‌పర్సన్ జి. షైనేష్ ఈ విషయంపై మాట్లాడుతూ.. “మహమ్మారి నుంచి బయటపడిన నేపథ్యంలో కొత్త మార్గాలు రూపొందించడానికి, స్క్రిప్ట్ చేయడానికి ఇది సరైన సమయం. FT గ్లోబల్ ర్యాంకింగ్ మా Exec Ed ప్రోగ్రామ్‌లను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సరైన స్ప్రింగ్‌బోర్డ్‌ను అందిస్తుంది." అని చెప్పారు.

First published:

Tags: Ahmedabad, Aiims, Career and Courses, Indian, New courses

ఉత్తమ కథలు