Sleep Job: 100 రోజులు నిద్రపోండి... రూ.లక్ష శాలరీ పొందండి

Sleep Internship: మళ్లీ నిద్రపోయే జాబ్ వచ్చేసింది. రోజూ 9 గంటల చొప్పున 100 రోజుల నిద్రకు... రూ.లక్ష ఇస్తోంది బెంగళూరులోని ఆ స్టార్టప్.

news18-telugu
Updated: August 31, 2020, 8:14 AM IST
Sleep Job: 100 రోజులు నిద్రపోండి... రూ.లక్ష శాలరీ పొందండి
Sleep Job: 100 రోజులు నిద్రపోండి... రూ.లక్ష శాలరీ పొందండి (symbolic image)
  • Share this:
Best Sleep Job: మీకు గుర్తుందా... బెంగళూరులోని వేక్‌ఫిట్ (WakeFit) స్టార్టప్... ఇదివరకు రోజూ 9 గంటల చొప్పున 100 రోజులు నిద్రపోయిన వారికి రూ.లక్ష చెల్లించింది. ఈ సంవత్సరం మరోసారి అదే ఆఫర్‌ని ప్రకటించింది. పరుపులు (mattress) తయారుచేసే ఈ కంపెనీ... ఈ కలల ఆఫర్‌ను 2019లో ఇచ్చింది. జస్ట్ నిద్రపోయినందుకు డబ్బు ఇచ్చింది. ఇలాంటి జాబ్ ఇస్తామంటే వద్దనేదెవరు? కానీ... ఈ జాబ్ పొందడం అంత తేలిక కాదు. దీనికి అప్లై చేసుకునేవాళ్లు... నిజంగానే వాళ్లు నిద్రపోవడంలో ఎక్స్‌పర్ట్స్ అని నిరూపించుకోవాలి. నిద్రకు వాళ్లు ఎప్పుడూ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని ప్రూవ్ చెయ్యాలి. నిద్రపోవడాన్ని వాళ్లు ప్రేమిస్తారని నిరూపించాలి. 2019లో ఈ జాబ్ కోసం 1.7 లక్షల మంది అప్లై చేసుకున్నారు. కానీ... 23 మంది మాత్రమే జాబ్ పొందారు.

2021లో ఈ ఉద్యోగం చేయడానికి ఇష్టపడేవారికోసం అప్లికేషన్ ప్రక్రియను కంపెనీ తమ వెబ్‌సైట్‌లో ప్రారంభించింది. ఆసక్తి ఉన్న వారు అప్లై చేసుకోమని కోరింది. ఇంతకీ ఇలా ఎందుకు చేస్తోంది అంటే... నిద్ర పట్ల ప్రజల్లో ఉన్న ఆలోచనా ధోరణిని మార్చడానికే అంటోంది కంపెనీ. ఈ రోజుల్లో చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. రోజుకు మాగ్జిమం 6 గంటలు కూడా నిద్రపోవట్లేదు. నిద్రలేమి వల్ల రకరకాల అనారోగ్యాలు వస్తున్నాయి. ముఖ్యంగా మనుషుల్లో వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోతోంది. బాగా నిద్రపోయే వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. అందుకే ఇలాంటి జాబ్ సృష్టించింది ఈ కంపెనీ. ఇందులో సెలెక్ట్ అయిన వారికి ఒక్కొక్కరికీ ఒక్కే పరుపు, దిండును ఇస్తుంది. పడుకునే ప్రతి ఒక్కరినీ 100 రోజులపాటూ ఈ కంపెనీ ట్రాక్ చేస్తుంది. రూల్స్ అతిక్రమిస్తే మనీ ఇవ్వదు.

దీన్ని జాబ్‌లా కాకుండా ఇంటెర్న్‌షిప్‌లా నిర్వహిస్తున్న కంపెనీ... స్లీప్ ట్రాకర్లను పాల్గొన్నవారికి ఇస్తుంది. ప్రత్యేక కౌన్సిలర్లు కూడా ఉంటారు. చెప్పినట్లుగానే రోజూ 9 గంటలు నిద్రపోతూ... 100 రోజులు పూర్తి చేసినవారు. రూ.లక్ష పొందగలరు.
Published by: Krishna Kumar N
First published: August 31, 2020, 8:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading