BENGALURU IKEA STORE IS HIRING FOR VARIOUS POSITIONS UMG GH
IKEA Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐకియా స్టోర్‌లో భారీగా ఉద్యోగాలు.. ఖాళీల వివరాలు ఇవే..!
ఐకియాలో ఉద్యోగాలు (Photo Credit: Reuters)
స్వీడన్ హోమ్ ఫర్నిషింగ్ దిగ్గజం ఐకియా(IKEA) ఇటీవల బెంగళూరులో భారీ స్టోర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్టోర్‌లో వివిధ పోస్టులను భర్తీ చేయడానికి నియామక ప్రక్రియ చేపట్టింది. మొత్తంగా 1000కి పైగా నియామకాలను చేపట్టనుంది.
స్వీడన్ హోమ్ ఫర్నిషింగ్ దిగ్గజం ఐకియా(IKEA) ఇటీవల బెంగళూరులో భారీ స్టోర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్టోర్‌లో వివిధ పోస్టులను భర్తీ చేయడానికి నియామక ప్రక్రియ చేపట్టింది. మొత్తంగా 1000కి పైగా నియామకాలను చేపట్టనుంది. ఇందులో 72 శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించనుంది. అన్ని ఉద్యోగ ఖాళీలు పుల్ టైం కోసం భర్తీ చేయనున్నట్లు ఐకియా ఇండియా తమ వెబ్సైట్లో పేర్కొంది.
తమ సంస్థలో ఉద్యోగులకు ఉత్తమమైన పని వాతావరణాన్ని సృష్టిస్తామని, అందరికీ సమాన వేతనం, వృద్ధి అవకాశాలను కల్పిస్తామని ఐకియా చెబుతోంది. మహిళలకు సాధికారత కల్పించడాన్ని కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. పురుషులకు రిజర్వ్ చేసే ఫోర్క్లిఫ్ట్ డ్రైవింగ్, పవర్ స్టాకింగ్, అసెంబ్లీ, ఇన్స్టాలేషన్ స్వరీసెస్ వంటి ఉద్యోగాలను కూడా మహిళలు చేపట్టారని కంపెనీ తెలిపింది.
నియామకాలు ఇలా..
ఐకియా బెంగళూరు స్టోర్, ప్రధానంగా ఈ పోస్టులను భర్తీ చేయనుంది.
- సర్వీస్ బిజినెస్ సెటిల్మెంట్ జూనియర్ స్పెషలిస్ట్
- గూడ్స్ ఫ్లో టీమ్ లీడర్ - VR మాల్
- SSS టీమ్-లీడర్ - VR మాల్
ఐకియా రూ.3,000 కోట్ల పెట్టుబడితో బెంగళూరులో కొత్త అవుట్‌లెట్‌ను ఇటీవల ప్రారంభించింది. ఈ ఏడాది 5 మిలియన్ల మంది ఈ స్టోర్‌ను సందర్శించే అవకాశం ఉందని IKEA అంచనా వేస్తోంది.
సంస్థ అంచనాలకు తగ్గట్టుగానే బెంగళూరు స్టోర్‌లో వారాంతంలో భారీ రద్దీ ఉంటుంది. స్టోర్ వద్ద ప్రజలు మూడు గంటల పాటు వేచి ఉండాల్సి పరిస్థితి ఏర్పడుతోంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో షాపింగ్ చేయాలంటూ కస్టమర్లకు ఐకియా ఇండియా ట్వీట్ ద్వారా తెలియజేసింది.
ఐకియా ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుసాన్ పుల్వెరెర్ మాట్లాడుతూ.. ‘మా వ్యాపారం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని సృష్టించేందుకు నిబద్ధతతో వ్యవహరిస్తాం. భారత్‌లో మొత్తం గృహోపకరణాల మార్కెట్‌ను పెంచడంలో IKEA ఇండియా బలమైన వ్యవస్థగా ఉంటుంది. అనేక మందికి అవకాశాలను కల్పిస్తాం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన రోజువారీ జీవితాన్ని సృష్టించడానికి మేము కట్టుబడి ఉన్నాం.” అని చెప్పుకొచ్చారు.
కాగా, బెంగళూర్ స్టోర్తొ కలిపి ఐకియాకు ఇప్పుడు దేశవ్యాప్తంగా నాలుగు అవుట్లెట్లు ఉన్నాయి. 2018లో మొట్టమొదటి స్టోర్‌ను ఐకియా హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఆ తరువాత 2020, 2021లో వరుసగా నవీ ముంబై, ముంబైలలో స్టోర్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.