Home /News /jobs /

BEL Recruitment: "బెల్‌"లో ప్రాజెక్టు ఇంజ‌నీర్‌ ఉద్యోగాలు.. జీతం రూ.50,000 ద‌ర‌ఖాస్తుకు మూడురోజులే అవ‌కాశం

BEL Recruitment: "బెల్‌"లో ప్రాజెక్టు ఇంజ‌నీర్‌ ఉద్యోగాలు.. జీతం రూ.50,000 ద‌ర‌ఖాస్తుకు మూడురోజులే అవ‌కాశం

బెల్ రిక్రూట్‌మెంట్‌

బెల్ రిక్రూట్‌మెంట్‌

బెంగుళూరుల ఉన్న భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ ( Bharath Electronics Limited) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 07 ప్రాజెక్టు ఇంజ‌నీర్లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు జీతం రూ.50,000 అందిస్తారు. ద‌ర‌ఖాస్తుకు కేవ‌లం మూడు రోజులే ఉంది. అంటే అక్టోబ‌ర్ 8, 2021 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...
    బెంగుళూరుల ఉన్న భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ ( Bharath Electronics Limited) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 07 ప్రాజెక్టు ఇంజ‌నీర్లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అభ్య‌ర్థుల‌ను ఒప్పంద ప్రాతిప‌దిక ఎంపిక చేయ‌నున్నారు. ఎంపికైన అభ్య‌ర్థులకు రూ.50,000 జీతం అందించ‌నున్నారు. ఎటువంటి పరీక్ష లేకుండా కేవ‌లం ఇంట‌ర్వ్యూ (Interview) ద్వారా పోస్టుకు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ఇంజ‌నీరింగ్ విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హులు . ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 8, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు విధానం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://www.bel-india.in/Default.aspx ను సంద‌ర్శించాలి.

    ముఖ్య‌మైన స‌మాచారం. .















    పోస్టు పేరు అర్హ‌త‌లు జీతం పోస్టుల సంఖ్య
    ప్రాజెక్టు ఇంజ‌నీర్ బీఈ/ బీటెక్ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభ‌వం ఉండాలి. మొద‌టి సంవ‌త్స‌రం - రూ.35,000/-
    రెండో సంవ‌త్స‌రం - రూ. 40,000/-
    మూడో సంవ‌త్స‌రం - రూ.45,000/-
    నాలుగో సంవ‌త్స‌రం - రూ.50,000/-
    07

    TCS Free Course : టీచ‌ర్స్‌కు టీసీఎస్ గుడ్ న్యూస్‌.. ఉచిత కోర్సు ప్రారంభం


    ఎంపిక విధానం..

    Step 1 :  ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థులను అకాడ‌మిక్ (Academic) మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.

    Step2 :  షార్ట్ లిస్ట్ అయిన‌ అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తారు.

    Step 3 :  అభ్య‌ర్థుల అకాడ‌మిక్ సామ‌ర్థ్యం, అనుభమే ఎంపికకు ముఖ్యం.

    Step 4 :  అకాడ‌మిక్ మార్కుల‌కు 75శాతం వెయిటేజ్ ఉంటుంది.

    Step 5 :  అనుభ‌వానికి 10శాతం మార్కులు

    Step 6 :  ఇంట‌ర్వ్యూకి 15శాతం మార్కులు ఉంటాయి.

     ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 :  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.

    Step 2 : ముంద‌గా అధికారిక వెబ్‌సైట్ https://www.bel-india.in/Default.aspx సంద‌ర్శించాలి.

    Step 3 : అనంత‌రం Career లో రిక్రూట్‌మెంట్ విభాగంలోకి వెళ్లాలి.

    Step 4 : అనంత‌ర నోటిఫికేష‌న్ పూర్తిగా చ‌ద‌వాలి (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    Step 5 : నోటిఫికేష‌న్ చ‌దివిన త‌రువాత అప్లే ఆన్‌లైన్ క్లిక్ చేసి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

    Step 6 : ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్త‌యిన త‌రువాత అప్లికేష‌న్ ఫాం ప్రింట్ తీసుకోవాలి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: CAREER, Engineering, Govt Jobs 2021, Job notification, JOBS

    తదుపరి వార్తలు