BEL Recruitment: బెల్ బెంగుళూర్‌లో ప్రాజెక్టు ఇంజ‌నీర్‌ ఉద్యోగాలు..

బెల్ జాబ్స్‌

బెంగుళూరుల ఉన్న భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ ( Bharath Electronics Limited) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 8, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

  • Share this:
    బెంగుళూరుల ఉన్న భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ ( Bharath Electronics Limited) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 07 ప్రాజెక్టు ఇంజ‌నీర్లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అభ్య‌ర్థుల‌ను ఒప్పంద ప్రాతిప‌దిక ఎంపిక చేయ‌నున్నారు. ఎంపికైన అభ్య‌ర్థులకు రూ.50,000 జీతం అందించ‌నున్నారు. ఎటువంటి పరీక్ష లేకుండా కేవ‌లం ఇంట‌ర్వ్యూ (Interview) ద్వారా పోస్టుకు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ఇంజ‌నీరింగ్ విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హులు . ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 8, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు విధానం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://www.bel-india.in/Default.aspx ను సంద‌ర్శించాలి.

    ముఖ్య‌మైన స‌మ‌చారం. .















    పోస్టు పేరు అర్హ‌త‌లు జీతం పోస్టుల సంఖ్య
    ప్రాజెక్టు ఇంజ‌నీర్ బీఈ/ బీటెక్ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభ‌వం ఉండాలి. మొద‌టి సంవ‌త్స‌రం - రూ.35,000/-
    రెండో సంవ‌త్స‌రం - రూ. 40,000/-
    మూడో సంవ‌త్స‌రం - రూ.45,000/-
    నాలుగో సంవ‌త్స‌రం - రూ.50,000/-
    07

    ఎంపిక విధానం..
    - ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థులను అకాడ‌మిక్ (Academic) మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
    - షార్ట్ లిస్ట్ అయిన‌ అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తారు.
    - అభ్య‌ర్థుల అకాడ‌మిక్ సామ‌ర్థ్యం, అనుభమే ఎంపికకు ముఖ్యం.
    - అకాడ‌మిక్ మార్కుల‌కు 75శాతం వెయిటేజ్ ఉంటుంది.
    - అనుభ‌వానికి 10శాతం మార్కులు
    - ఇంట‌ర్వ్యూకి 15శాతం మార్కులు ఉంటాయి.

    UPSC Recruitment 2021: యూపీఎస్సీలో 59 ఖాళీలు.. అర్హ‌త‌లు ఇవే

    ద‌ర‌ఖాస్తు విధానం..
    Step 1 :  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.

    Step 2 : ముంద‌గా అధికారిక వెబ్‌సైట్ https://www.bel-india.in/Default.aspx సంద‌ర్శించాలి.

    Step 3 : అనంత‌రం Career లో రిక్రూట్‌మెంట్ విభాగంలోకి వెళ్లాలి.

    Step 4 : అనంత‌ర నోటిఫికేష‌న్ పూర్తిగా చ‌ద‌వాలి (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    Step 5 : నోటిఫికేష‌న్ చ‌దివిన త‌రువాత అప్లే ఆన్‌లైన్ క్లిక్ చేసి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

    Step 6 : ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్త‌యిన త‌రువాత అప్లికేష‌న్ ఫాం ప్రింట్ తీసుకోవాలి.
    Published by:Sharath Chandra
    First published: