Home /News /jobs /

BEL Recruitment 2021 : "బెల్‌"లో 88 ఇంజ‌నీరింగ్ ఉద్యోగాలు.. జీతం రూ.50,000

BEL Recruitment 2021 : "బెల్‌"లో 88 ఇంజ‌నీరింగ్ ఉద్యోగాలు.. జీతం రూ.50,000

బెల్ రిక్రూట్‌మెంట్ 2021

బెల్ రిక్రూట్‌మెంట్ 2021

పంచకులలో ఉన్న భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ ( Bharath Electronics Limited) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 88 ప్రాజెక్ట్ ఇంజనీర్- I, ట్రైనీ ఇంజనీర్- I పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వీటి ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 27, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...
    పంచకులలో ఉన్న భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ ( Bharath Electronics Limited) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా 88 ప్రాజెక్ట్ ఇంజనీర్- I, ట్రైనీ ఇంజనీర్- I (Trainee Engineer) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఎంపికైన అభ్య‌ర్థులకు రూ.25,000 జీతం నుంచి రూ.50,000 జీతం అందించ‌నున్నారు. ఎటువంటి పరీక్ష (Exam) లేకుండా కేవ‌లం ఇంట‌ర్వ్యూ (Interview) ద్వారా పోస్టుకు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ఇంజ‌నీరింగ్ విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హులు . ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 27, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు విధానం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://www.bel-india.in/Default.aspx ను సంద‌ర్శించాలి.

    ముఖ్య‌మైన స‌మాచారం. .





















    పోస్టు పేరు అర్హ‌త‌లు జీతం పోస్టుల సంఖ్య
    ప్రాజెక్టు ఇంజ‌నీర్ -I (Project Engineer) బీఈ/ బీటెక్ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభ‌వం ఉండాలి. మొద‌టి సంవ‌త్స‌రం - రూ.35,000/-
    రెండో సంవ‌త్స‌రం - రూ. 40,000/-
    మూడో సంవ‌త్స‌రం - రూ.45,000/-
    నాలుగో సంవ‌త్స‌రం - రూ.50,000/-
    55
    ట్రైనీ ఇంజనీర్- I (Trainee Engineer) బీఈ/ బీటెక్ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభ‌వం ఉండాలి. మొద‌టి సంవ‌త్స‌రం - రూ.25,000/-
    రెండో సంవ‌త్స‌రం - రూ. 28,000/-
    మూడో సంవ‌త్స‌రం - రూ.31,000/-
    33

    ముఖ్య‌మైన స‌మాచారం.
    ద‌రఖాస్తు ప్రారంభ - అక్టోబ‌ర్ 6, 2021
    ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ - అక్టోబ‌ర్ 27, 2021
    ద‌ర‌ఖాస్తు ఫీజు - ప్రాజెక్టు ఇంజ‌నీర్ రూ.500, ట్రైనీ ఇంజ‌నీర్ రూ.200
    ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ వారికి ప‌రీక్ష ఫీజు లేదు.


    ISRO Recruitment 2021 : ఇస్రోలో రీసెర్చ్‌ఫెలో ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండా ఎంపిక‌.. జీతం రూ.31,000


    ఎంపిక విధానం..

    Step 1 :  ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థులను అకాడ‌మిక్ (Academic) మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.



    Step2 :  షార్ట్ లిస్ట్ అయిన‌ అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తారు.

    Step 3 :  అభ్య‌ర్థుల అకాడ‌మిక్ సామ‌ర్థ్యం, అనుభమే (Experience) ఎంపికకు ముఖ్యం.

    Step 4 :  అకాడ‌మిక్ మార్కుల‌కు 75శాతం వెయిటేజ్ (Waitage) ఉంటుంది.

    Step 5 :  అనుభ‌వానికి 10శాతం మార్కులు

    Step 6 :  ఇంట‌ర్వ్యూకి 15శాతం మార్కులు ఉంటాయి.

    TCS iON Course: టీచ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. టీసీఎస్ ఐఓఎన్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ కోర్స్‌


     ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 :  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.

    Step 2 : ముంద‌గా అధికారిక వెబ్‌సైట్ https://www.bel-india.in/Default.aspx సంద‌ర్శించాలి.

    Step 3 : అనంత‌రం Career లో రిక్రూట్‌మెంట్ విభాగంలోకి వెళ్లాలి.

    Step 4 : అనంత‌ర నోటిఫికేష‌న్ పూర్తిగా చ‌ద‌వాలి (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    Step 5 : నోటిఫికేష‌న్ చ‌దివిన త‌రువాత అప్లే ఆన్‌లైన్ క్లిక్ చేసి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

    Step 6 : ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్త‌యిన త‌రువాత అప్లికేష‌న్ ఫాం ప్రింట్ తీసుకోవాలి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Bharat Electronics Limited, CAREER, Govt Jobs 2021, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు