BEL RECRUITMENT 2022 ONLINE APPLICATIONS INVITING FOR 247 NEW VACANCIES SALARY UP TO RS 55000 HERE FULL DETAILS NS
BEL Recruitment 2022: బీటెక్, బీఎస్సీ, ఎంబీఏ చేసిన వారికి BELలో 247 జాబ్స్.. ఇలా అప్లై చేయండి
ప్రతీకాత్మక చిత్రం
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. వివిధ విభాగాల్లో మొత్తం 247 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్, ట్రైనీ ఆఫీసర్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యొక్క బెంగళూరు క్యాంపస్ లో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అయితే, కాంట్రాక్ట్ విధానంలో ఈ నియామకాలను చేపట్టారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ గా ఎంపికైన అభ్యర్థులు నాలుగేళ్ల పాటు పని చేయాల్సి ఉంటుంది. ట్రైనీ ఇంజనీర్ మరియు ట్రైనీ ఆఫీసర్స్ గా ఎంపికైన వారు మూడేళ్ల పాటు పని చేయాల్సి ఉంటుంది.
ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
40
మెకానికల్ ఇంజనీరింగ్
14
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
9
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
2
సివిల్ ఇంజనీరింగ్
2
ట్రైని ఇంజనీర్:బీఈ, బీటెక్. బీఎస్సీ, బీఆర్క్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు కనీసం ఆరు నెలలు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ (https://www.bel-india.in/Default.aspx) ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం కెరీర్ విభాగంలో Recruitment-Advertisement ఆప్షన్ ను ఎంచుకోవాలి.
Step 3: తర్వాత Project Engineer 1, ట్రైనీ ఇంజనీర్ 1, ట్రైనీ ఆఫీసర్(ఫైనాన్స్)-1 అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
Step 4: ఇందులో మీరు కావాల్సిన ఆప్షన్ ను ఎంచుకోవాలి.
Step 5: అనంతరం కావాల్సిన వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫామ్ ను నింపాలి.
Step 6: అనంతరం భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను భద్రపరుచుకోవాలి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.