Home /News /jobs /

BEL RECRUITMENT 2022 ON THE POST OF SENIOR ASSISTANT ENGINEER LAST DATE 10 SEPTEMBER KNOW FULL DETAILS HERE VB

BEL Recruitment 2022: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెట్ లో ఉద్యోగాలు.. జీతం రూ.1.20 లక్షలు..

BEL Recruitment 2022: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెట్ లో ఉద్యోగాలు.. జీతం రూ.1.20 లక్షలు..

BEL Recruitment 2022: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెట్ లో ఉద్యోగాలు.. జీతం రూ.1.20 లక్షలు..

BEL Recruitment 2022: భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఖాళీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. వివరాల్లోకి వెళ్తే..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఖాళీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్ సైట్ ద్వారా  దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని వివరాలతో ఆప్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు BEL అధికారిక వెబ్‌సైట్ bel-india.in సందర్శించడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.  ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 10.

TSLPRB Constable Hall tickets: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్స్ విడుదలపై అప్ డేట్..


ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా BELలో మొత్తం 6 సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను నియమించనుంది. దీనిలో మూడు పోస్టులు జనరల్ కేటగిరీకి.. నాన్ క్రీమిలేయర్ ఓబీసీకి రెండు, ఎస్సీ కేటగిరీకి మరో పోస్టును కేటాయించారు.

పోస్టుకు సంబంధించి 15 సంవత్సరాల అనుభం కలిగిన వాళ్లు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అభ్యర్థి యొక్క వయస్సు 50 సంవత్సారలకు మించకూడదని తెలిపారు.

మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీ కోసమే ఈ కరెంట్ అఫైర్స్..

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన సంస్థ నుండి డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అంటే.. ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్ లో బీటెక్.. డిప్లొమా చేసిన వారు అర్హులు. ఇంజనీరింగ్ లో మెకానికల్ కోర్సు చేసిన వారు కూడా అర్హులుగా పేర్కొన్నారు.

ఈ పోస్టులలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30 వేల రూపాయల నుండి నెలకు రూ. 1 లక్ష 20 వేల వరకు జీతం ఇవ్వబడుతుంది. ఎంపికైన అభ్యర్థుల యొక్క పోస్టింగ్ అనేది విశాఖపట్నం, ముంబై, కోల్‌కతాలో ఇవ్వనున్నారు.

నియామకం ఇలా..

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్షకు సంబంధించి హాల్ టికెట్స్ ను విడుదల చేస్తారు. అందులో మెరిట్ సాధించిన అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి.. ఇందులో ప్రతిభ కనిబరిచిన వారిని ఫైనల్ గా మెడికల్ టెస్ట్ కు పిలుస్తారు. ఈ మూడింటిలో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేస్తారు. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ ను డౌన్ లోడ్ చేసుకొని తెలుసుకోవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ..

Step 1: ముందుగా అభ్యర్థులు bel-india.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Step 2: ఆ తర్వాత అభ్యర్థులు సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.

Step 3: ఇప్పుడుఇచ్చిన నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి.

Step 4: ఆ తర్వాత అభ్యర్థులు BEL రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు ఫారమ్‌ను డౌన్ లోడ్ చేేసుకోవాలి.

Step 5: ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన అన్ని వివరాలను పూరించాలి.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ తో పాటు.. తగిన సర్టిఫికేట్లను జత చేసి.. DGM (HR/MR,MS&ADSN), Bharat Electronics Limited, జలహళ్లి PO, బెంగళూరు 560013 కు పోస్ట్ ద్వారా పంపవచ్చు. ఎన్వలప్ పేపర్ పై అభ్యర్థులు ‘Application for the post of Sr. AE for ADSN.’ అని రాసి పంపించాలి.
Published by:Veera Babu
First published:

Tags: Bel, Career and Courses, Central governmennt, Central Government Jobs, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు