Home /News /jobs /

BEL RECRUITMENT 2022 NOTIFICATION RELEASED FOR PROJECT TRAINEE ENGINEER POSTS ON BEL INDIA IN HERE DETAILS NS

BEL recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. BELలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది.

    భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ట్రైనీ ఇంజనీర్-1, ప్రాజెక్ట్ ఇంజనీర్-1 విభాగంలో ఖాలీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు ఏప్రిల్ 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 63 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో ట్రైనీ ఇంజనీర్ విభాగంలో 26, ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగంలో 37 ఖాళీలు ఉన్నాయి. బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    IPPB Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి



    ఎలా అప్లై చేయాలంటే..
    Step 1: అభ్యర్థులు మొదటగా bel-india.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం Career విబాగంలో ‘Recruitment Advertisement’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 3: మీరు అప్లై చేయాలనుకుంటున్న పోస్టును సెలక్ట్ చేయాలి.
    Step 4: లాగిన్ అయ్యి.. అప్లికేషన్ ఫామ్ ను నింపాలి.
    Step 5: ఫీజు చెల్లించి ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
    Step 6: అప్లికేషన్ పూర్తయిన తర్వాత ఫామ్ ప్రింట్ తీసుకోవాలి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Bharat Electronics Limited, Central Government Jobs, Job notification

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు