Home /News /jobs /

BEL RECRUITMENT 2022 APPLICATIONS INVITING FOR 150 TRAINEE ENGINEER AND PROJECT ENGINEER VACANCIES HERE DETAILS NS

BEL Recruitment 2022: బీటెక్ చేసిన వారికి శుభవార్త.. భారత్ ఎలక్ట్రానిక్స్ లో జాబ్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

    భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (BEL Job Notification) విడుదల చేసింది. మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు (Jobs) సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జులై 19న ప్రారంభమైంది. దరఖాస్తుకు వచ్చే నెల 3ను ఆఖరి తేదీగా నిర్ణయించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అధికారిక వెబ్ సైట్ bel-india.inలో ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ట్రీని ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

    విద్యార్హతల వివరాలు:
    నాలుగేళ్ల బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు AICTE గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి ఈ డిగ్రీ పొంది ఉండాలి. ఓబీసీ/ఈడబ్ల్యూఎస్/జనరల్ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పాసై ఉండాలి. ఇతర అభ్యర్థులు పాసైతే సరిపోతుంది. ఎంపికైన అభ్యర్థులు సంస్థకు చెందిన బెంగళూరు కాంప్లెక్స్ లో పని చేయాల్సి ఉంటుంది. ట్రైనీ ఇంజనీర్ ఖాళీలకు అప్లై చేసుకునే వారి వయస్సు ఆగస్టు 1 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న వారి వయస్సు 32 ఏళ్లలోపు ఉండాలి.
    CREDR Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. CREDR సంస్థలో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి



    ఎలా అప్లై చేయాలంటే..
    Step 1: అభ్యర్థులు మొదటగా బీఈఎల్ అధికారిక వెబ్ సైట్ www.bel-india.inను ఓపెన్ చేయాలి.
    Step 2: హోం పేజీలో Career ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
    Step 3: తర్వాత నోటిఫికేషన్ ను పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ను నింపాలి.
    Step 4: కావాల్సిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
    Step 5: దరఖాస్తు ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకోవాలి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు