ఇటీవల ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల అవుతున్నాయి. తాజాగా మరో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 13 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ట్రైనీ ఇంజనీర్: కంప్యూటర్ సైన్స్ విభాగంలో బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఈ విద్యార్హత పొంది ఉండాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, PwBD అభ్యర్థులు పాసైతే చాలు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.30000 వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ప్రాజెక్ట్ ఇంజనీర్: గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి బీఈ/బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు 55 శాతం, ఎస్సీ, ఎస్టీ, PwBD అభ్యర్థులు పాసై ఉండాలి. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 40000 వేతనం ఉంటుంది.
Jobs In NTRO: డిగ్రీ, పీజీతో ప్రభుత్వ ఉద్యోగాలు .. 182 పోస్టులకు నోటిఫికేషన్..
S.No. | పోస్టు | ఖాళీలు |
1. | ట్రైనీ ఇంజనీర్ | 4 |
2. | ప్రాజెక్ట్ ఇంజనీర్ | 9 |
మొత్తం: | 13 |
దరఖాస్తు ఫీజు:
ట్రైనీ ఇంజనీర్ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.150, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారు రూ.450 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్ సైట్: https://www.bel-india.in/Default.aspx
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.