దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల్లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఒకటన్న విషయం తెలిసిందే. ఈ సంస్థలో ఉద్యోగాలకు (BEL Jobs) మంచి క్రేజ్ ఉంటుంది. ఈ సంస్థ నుంచి ఎప్పుడెప్పుడూ ఉద్యోగ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల అవుతాయా అంటూ అంతా ఆసక్తి చూపుతూ ఉంటారు. తాజాగా.. బీఈఎల్ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 111 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 23లోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు:
విభాగం | ఖాళీలు |
ట్రైనీ ఇంజనీర్-1: | 33 పోస్టులు |
ప్రాజెక్ట్ ఇంజనీర్-1: | 39 పోస్టులు |
ట్రైనీ ఇంజనీర్-1: | 17 పోస్టులు |
ప్రాజెక్ట్ ఇంజనీర్-1: | 22 పోస్టులు |
విద్యార్హతల వివరాలు: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
UIDAI Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. యూఐడీఏఐలో జాబ్స్ .. ఖాళీలు, విద్యార్హతల వివరాలివే
వయోపరిమితి: ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారి వయస్సు అక్టోబర్ 1 నాటికి 28 ఏళ్ల గరిష్ట వయోపరిమితి ఉండాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 32 ఏళ్లకు మించకుండా ఉండాలి. వివిధ వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
వేతనం: టెక్నికల్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.55 వేల వేతనం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.400, ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.150 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అభ్యర్థుల ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
అధికారిక వెబ్ సైట్: https://bel-india.in/Default.aspx
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.