భారత ప్రభుత్వ రంగ సంస్థ ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (Bharat Electronics Limited)లో మెంబర్ (రిసెర్చ్ స్టాఫ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బెల్ సెంట్రల్ రిసెర్చ్ ల్యాబొరేటరీలో పని చేయడానికి అర్హులవుతారు. పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు గరిష్టంగా నెలకు రూ.1,60,000 వేతనం అందిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ (Online) పద్ధతిలో మాత్రమే ఉంటుంది. ఈ పోస్టులకు ఇంజనీరింగ్ ఉద్యోగాలు చేసిన వారు అర్హులు. దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.bel-india.in/Default.aspx ను సందర్శించాలి. ఈ పోస్టుల దరఖాస్తుకు డిసెంబర్ 8, 2021 వరకు అవకాశం ఉంది.
ముఖ్యమైన సమాచారం..
పోస్టు పేరు | పోస్టుల సంఖ్య | అర్హతలు | జీతం |
మెంబర్ (రీసెర్చ్ స్టాఫ్) | 10 | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజనీరింగ్ చేసి ఉండాలి. కనీసం నాలుగు సంవత్సరాలు సీ++, జావా, పైథాన్, ఏఐ అండ్ బిగ్ డేటా వంటి వాటిపై పని చేసి ఉండాలి. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థి సెప్టెంబర్ 30 నాటికి 32 ఏళ్లు మించి ఉండకూడదు. | రూ.50,000/ నుంచి రూ.1,60,000 + అలవెన్స్ |
ఎంపిక విధానం..
Step 1: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
Bank Exam Preparation: ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంక్ ఉద్యోగాలు.. ఎలా ప్రిపేర్ అవ్వాలి.. ఏం చదవాలి?
Jobs in PhonePe : మ్యూచ్‌వల్ ఫండ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు.. అప్లికేషన్ ప్రాసెస్, అర్హతలు
Step 2: అనంతరం పరీక్ష పాసైన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
Step 3: ఇంటర్వ్యూలో పాసైన వారికి సర్టిఫికెట్లను పరిశీలించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.
Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.bel-india.in/Default.aspx ను సందర్శించాలి.
Step 3 : అనంతరం నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4 : నోటిఫికేషన్ వివరాలు తెలుసుకొని Click here for online application లింక్‌పై క్లిక్ చేయాలి.
Step 5 : అనంతరం దరఖాస్తు ఫాంను పూర్తి చేయాలి.
Step 6 : పరీక్ష ఫీజు చెల్లించేందుకు Click here for payment of application fee through SBI Collect లింక్‌పై క్లిక్ చేయాలి.
HAL Recruitment 2021: హెచ్ఏఎల్‌లో పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు.. జీతం రూ.21,473
Step 7 : అప్లికేషన్ ఫాం పూర్తయిన తరువాత ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.
Step 8 : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 8, 2021 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Engineering course, Govt Jobs 2021, Job notification, JOBS