• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • BEL RECRUITMENT 2021 NOTIFICATION RELEASED FOR JOB VACANCIES AT BHARAT ELECTRONICS LIMITED NAVI MUMBAI UNIT NS

BEL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. బీఈఎల్ లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 19లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ట్రైనీ ఇంజనీర్-1, ట్రైనీ ఆఫీసర్-1 మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్-1 విభాగంలో మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సూచించిన ఫార్మాట్లో మే 19లోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
    DFCCIL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ప్రముఖ సంస్థలో వేయికి పైగా ఉద్యోగాలు.. వివరాలివే
    BHEL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. బీహెచ్ఈఎల్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో మూడు రోజులే ఛాన్స్

    ఖాళీల వివరాలు..
    ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 23 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. విభాగాల వారీగా  ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
    ట్రైనీ ఇంజనీర్-I: 20 పోస్టులు
    ప్రాజెక్ట్ ఆఫీసర్-I: 01 పోస్టు
    ట్రైనీ ఆఫీసర్-I: 02 పోస్టులు
    NHAI Recruitment 2021: NHAIలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ లేకుండా మార్కుల ఆధారంగానే ఎంపిక.. పూర్తి వివరాలివే..

    విద్యార్హతల వివరాలు..
    ట్రైనీ ఇంజనీర్-1: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, టెలీకమ్యూనికేషన్ తదితర విభాగాల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) కోర్సులు చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థుల వయస్సు ఏప్రిల్ 01 నాటికి గరిష్టంగా 25 ఏళ్ల వయస్సు ఉండాలి.
    ప్రాజెక్ట్ ఆఫీసర్-I: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి CA/ICWA/MBA (Finance) తదితర కోర్సులు చేసి ఉండాలి. ఏప్రిల్ 1 నాటికి గరిష్టంగా 28 ఏళ్ల వయస్సు ఉండాలి.
    ట్రైనీ ఆఫీసర్-I: ఈ విభాగంలో ఉద్యోగాలకు అప్లై చేయాలనకుంటున్న అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి MBA/MSW/PGDM in HR తదితర కోర్సులు చేసి ఉండాలి. ఏప్రిల్ 1 నాటికి గరిష్టంగా 25 ఏళ్ల వయస్సు ఉండాలి.
    Applications & Notification - Direct Link

    ఎలా అప్లై చేయాలంటే..
    అభ్యర్థులు మొదటగా అప్లికేషన్ ఫామ్ ను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. ఆ ఫామ్ ను ఫిల్ చేసి సెల్ఫ అటెస్ట్ చేసిన డాక్యుమెంట్లను Sr. Dy. Gen. Manager (CS, FTD, HR&A) Bharat Electronics Limited, Plot No. L-1, MIDC Industrial Area, Taloja, Navi Mumbai: 410208, Maharashtra. చిరునామాకు పంపాలి. అప్లికేషన్ ఫామ్ ఈ చిరునామాకు 19లోగా చేరేలా పోస్టులో పంపించాల్సి ఉంటుంది. కేవలం పోస్టులో వచ్చిన అప్లికేషన్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published: