BEL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. మచిలీపట్నం బీఈఎల్ లో ఉద్యోగాలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

మచిలీపట్నం బీఈఎల్ లో ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. తాజాగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మచిలీపట్నం యూనిట్లో ఈ నియమాలు చేపడుతున్నారు. మొత్తం 6 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ నియామకాలు చేపట్టినట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
  India Post Recruitment 2021: టెన్త్, ఇంటర్ అర్హతతో పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి.. వివరాలివే
  Railway Recruitment 2021: రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక

  ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
  ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 ఖాళీలను భర్తీ చేస్తుండగా ఇందులో మూడు ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగంలో ఉండగా.. మరో మూడు ట్రైనీ ఇంజనీర్ విభాగంలో ఉన్నాయి. కింద పేర్కొన్న స్ట్రీమ్స్ లలో బీఈ, బీటెక్ కోర్సులను గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీలో చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఫస్ట్ క్లాసులో పాసై ఉండాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) విభాగంలో 1 ఖాళీ, ప్రాజెక్ట్ ఇంజనీర్(మెకానికల్) విభాగంలో 1, ప్రాజెక్ట్ ఇంజనీర్(సివిల్) విభాగంలో 1, ట్రైనీ ఇంజనీర్(ఎలక్ట్రికల్) విభాగంలో 1, ట్రైనీ ఇంజనీర్(మెకానికల్) విభాగంలో 1, ట్రైనీ ఇంజనీర్(సివిల్) విభాగంలో మరో ఖాళీ ఉంది.
  Notification - Direct Link

  ఎలా అప్లై చేయాలంటే..
  అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 3లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న వారు రూ. 500, ట్రైనీ ఇంజనీర్ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న వారు రూ. 200లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. PWD, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
  Published by:Nikhil Kumar S
  First published: