BEL RECRUITMENT 2021 FOR ENGINEERS NOTIFICATIONS RELEASED FOR PROJECT ENGINEER VACANCIES SALARY UPTO RS 35000 HERE FULL DETAILS NS
BEL Recruitment 2021: బీటెక్, ఎంటెక్ చేసిన వారికి అలర్ట్.. బీఈఎల్ లో రూ.35 వేల వేతనంతో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి
బీటెక్, ఎంటెక్ చేసిన వారికి అలర్ట్.. బీఈఎల్ లో రూ.35 వేల వేతనంతో జాబ్స్.. అప్లై ఇలా..
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఈ నెల 24ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఉద్యోగాల (Jobs) భర్తీకి మరో నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు రెండేళ్ల పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా కాంట్రాక్ట్ మరో రెండేళ్లు పొడిగించే అవకాశం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు మచిలీపట్నం (Bharat Electronics Limited, Machilipatnam) యూనిట్లో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు డిసెంబర్ 24ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై (BEL Job Application) చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేవారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.. Step 1:అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. Step 2:అనంతరం Recruitment of Project Engineer - I – Machilipatnam Unit కేటగిరీ కనిపిస్తుంది. ఆ కేటగిరీలో Detailed advertisement – Click here, Application Form - Click here తదితర ఆప్షన్లు కనిపిస్తాయి. Step 3:Application Form - Click here ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీంతో మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. Step 4:అప్లికేషన్ ఫామ్ లో పేరు, చిరునామా, విద్యార్హతల వివరాలను నింపాలి.
Step 5:అప్లికేషన్ ఫామ్ కు విద్యార్హతల సర్టిఫికేట్లు, కుల ధ్రువీకరణ పత్రం, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ను జత చేయాల్సి ఉంటుంది. Step 6:అప్లికేషన్ ఫామ్ ను Manager (HR) ,Bharat Electronics Limited, Ravindranath Tagore Road, Machilipatnam – 521001, Andhra Pradesh చిరునామాకు ఈ నెల 24లోగా పంపించాల్సి ఉంటుంది.
-అప్లికేషన్ ఫామ్ నింపడానికి ముందు నోటిఫికేషన్ ను పూర్తిగా చదవడం మంచిది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.