Home /News /jobs /

BEL RECRUITMENT 2021 FOR ENGINEERS NOTIFICATION RELEASED FOR 10 NEW VACANCIES HERE FULL DETAILS NS

BEL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. రూ.55 వేల వేతనంతో BELలో జాబ్స్.. ఇలా అప్లై చేయండి

నిరుద్యోగులకు శుభవార్త.. రూ.55 వేల వేతనంతో BELలో జాబ్స్.. ఇలా అప్లై చేయండి

నిరుద్యోగులకు శుభవార్త.. రూ.55 వేల వేతనంతో BELలో జాబ్స్.. ఇలా అప్లై చేయండి

ఇటీవల భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదలవుతున్నాయి. తాజాగా సంస్థ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగంలో ఈ ఖాళీలను (Jobs) భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు జనవరి 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, Pw BD అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. ఎంపికైన అభ్యర్థులు నాలుగేళ్ల పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 40 వేల నుంచి రూ. 55 వేల వరకు వేతనం చెల్లిస్తారు.
    Jobs in Hyderabad: రూ.95,000 వరకు వేతనంతో హైదరాబాద్‌లోని మింట్‌లో జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు 55 శాతం మార్కులతో ఈ విద్యార్హతను పొంది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, PwBD అభ్యర్థులు పాసై ఉంటే సరిపోతుంది.
    Railway Recruitment 2021: డిగ్రీ అర్హతతో ఇండియన్ రైల్వేలో 520 జాబ్స్.. దరఖాస్తుకు ఈ ఒక్క రోజే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

    ఎలా అప్లై చేయాలంటే..
    Steps 1: అభ్యర్థులు మొదటగా https://www.bel-india.in/Default.aspx ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం Careers విభాగంలో Recruitment-Advertisements సెలక్ట్ చేసుకోవాలి.
    Step 3: అనంతరం ఈ లింక్స్ (Link 1 & Link 2) పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
    Step 4: అనంతరం అప్లికేషన్ ఫామ్ ను నింపాలి. ఆ అప్లికేషన్ పామ్ కు నోటిఫికేషన్లో సూచించిన డాక్యుమెంట్లను జత చేసి పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది.


    అప్లికేషన్ ఫామ్ ను Senior Deputy General Manager (HR), Naval Systems SBU, Bharat Electronics Limited, Jalahalli Post, Bangalore 560013, Karnataka చిరునామకు జనవరి 6లోగా పింపించాల్సి ఉంటుంది.
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Bharat Electronics Limited, Central Government Jobs, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు