హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

BEL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. BELలో బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. రూ. 50 వేల వరకు వేతనం

BEL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. BELలో బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. రూ. 50 వేల వరకు వేతనం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Job Notification) విడుదల చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

  కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో దేశంలో నియామకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రైవేటు సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు సైతం జోరుగా ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. ఇటీవల ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలు అయిన ఇస్రో(ISRO), డీఆర్డీఓ(DRDO), బెల్(BEL) నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అయ్యాయి. తాజాగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టారు. ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన వారికి పోస్టుల ఆధారంగా రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు వేతనం చెల్లించనున్నట్లు తెలిపారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

  పోస్టుఖాళీలు
  ట్రైనీ ఇంజనీర్-I10
  ప్రాజెక్ట్ ఇంజనీర్-I4
  మొత్తం ఖాళీలు14


  Education Qualification: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, టెలీకమ్యూనికేషన్, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో బీఈ లేదా బీటెక్ చేసిన అభ్యర్థులు ట్రైనీ ఇంజనీర్ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

  -ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో బీఈ లేదా బీటెక్ చేసిన అభ్యర్థులు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఇతర వివరాలను అభ్యర్థులు నోటిఫికేషన్లో చూడొచ్చు.

  Oil India Jobs 2021: ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 535 ఉద్యోగాలు... ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి

  ఎలా అప్లై చేయాలంటే..

  ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు సెప్టెంబర్ 8ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ప్రాజక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు రూ. 500 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న వారు రూ. 200 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, PWD అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు.

  Application & Notification - Direct Link

  Remuneration: ట్రైనీ ఇంజనీర్ ఖాళీలకు ఎంపికైన వారికి మొదటి ఏడాది నెలకు రూ. 25 వేలు, రెండో ఏడాది నెలకు రూ. 28 వేలను చెల్లించనున్నారు. మూడో ఏడాది నెలకు రూ.31 వేలను చెల్లించనున్నారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి మొదటి ఏడాది నెలకు రూ. 40 వేలు, రెండో ఏడాది నెలకు రూ. 45 వేలు, మూడో ఏడాది నెలకు రూ. 50 వేలను చెల్లించనున్నారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS

  ఉత్తమ కథలు