Home /News /jobs /

BEL RECRUITMENT 2021 BHARAT ELECTRONICS LIMITED RELEASED NOTIFICATION FOR 36 POSTS KNOW VACANCIES SS

BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

BEL Recruitment 2021 | బీటెక్ పాసయ్యారా? మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

    బీటెక్ పాసైనవారికి శుభవార్త. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బెంగళూరులోని నావల్ సిస్టమ్స్ ఎస్‌బీయూలోని భారత్ ఎలక్ట్రానిక్స్ యూనిట్‌లో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ప్రాజెక్ట్ ఇంజనీర్, సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 36 ఖాళీలను ప్రకటించింది. వీరిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకోనుంది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL. ప్రయాణాలు ఇష్టపడేవారు మాత్రమే దరఖాస్తు చేయాలని ఈ సంస్థ కోరుతోంది. ప్రాజెక్ట్ ఇంజనీర్, సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఎంపికైనవారికి వైజాగ్‌తో పాటు బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, గాంధీనగర్, కొచ్చి, గుర్గావ్, పోర్ట్‌బ్లెయిర్‌లో పోస్టింగ్‌లు ఉంటాయి. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను https://www.bel-india.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా పంపాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జనవరి 16 చివరి తేదీ.

    UPSC Recruitment 2020: యూపీఎస్‌సీ మరో జాబ్ నోటిఫికేషన్... ఖాళీలు ఎన్నంటే

    BARC Recruitment 2021: ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తున్న బార్క్... మొత్తం 160 ఖాళీలు

    BEL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 36
    ప్రాజెక్ట్ ఇంజనీర్ 1- 6
    సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్- 30

    OMPL Jobs 2021: ఓఎన్‌జీసీ సంస్థలో జాబ్స్... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

    AAI Recruitment 2020: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 180 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    BEL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 30
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 16
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. బీఈ లేదా బీటెక్ పాసైనవారు అఫ్లై చేయొచ్చు. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
    వేతనం- ప్రాజెక్ట్ ఇంజనీర్‌కు రూ.50,000, సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్‌కు రూ.1,20,000
    దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
    Sr. Dy. General Manager (HR),
    Naval Systems SBU,
    Bharat Electronics Limited,
    Jalahalli Post, Bangalore – 560013,
    Karnataka.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bharat Electronics Limited, CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు