• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • BEL RECRUITMENT 2021 BHARAT ELECTRONICS LIMITED RELEASED NOTIFICATION FOR 305 APPRENTICE POSTS SS

BEL Recruitment 2021: డిప్లొమా పాసైనవారికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 305 ఉద్యోగాలు

BEL Recruitment 2021: డిప్లొమా పాసైనవారికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 305 ఉద్యోగాలు

BEL Recruitment 2021: డిప్లొమా పాసైనవారికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 305 ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)

BEL Recruitment 2021 | డిప్లొమా పాసైనవారి నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. మొత్తం 305 ఖాళీలను భర్తీ చేస్తోంది.

  • Share this:
    డిప్లొమా పాసైనవారికి శుభవార్త. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ లాంటి విభాగాల్లో అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 305 ఖాళీలున్నాయి. బెంగళూరులోని యూనిట్‌లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జనవరి 22 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.bel-india.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు విద్యార్హతలు తెలుసుకోవాలి. అన్ని విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-NATS పోర్టల్ http://www.mhrdnats.gov.in/ లో దరఖాస్తు చేయాలి.

    BEL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్- 25
    ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 150
    మెకానికల్ ఇంజనీరింగ్- 100
    ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 25
    కెమికల్ ఇంజనీరింగ్- 5

    LIC Agent Jobs 2021: టెన్త్ పాసైతే ఎల్ఐసీ ఏజెంట్ ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

    BHEL Recruitment 2021: బీహెచ్ఈఎల్‌లో 150 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    BEL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 జనవరి 4
    NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేయడానికి చివరి తేదీ- 2021 జనవరి 19
    భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ- 2021 జనవరి 22
    షార్ట్‌లిస్ట్ విడుదల- 2021 జనవరి 27
    సర్టిఫికెట్ వెరిఫికేషన్- 2021 ఫిబ్రవరి 3

    BEL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    విద్యార్హతలు- సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ టెక్నాలజీ
    స్టైపెండ్- నెలకు రూ.10,400
    వయస్సు- 22 ఏళ్ల లోపు
    శిక్షణా కాలం- 1 ఏడాది

    CISF ASI Recruitment 2021: సీఐఎస్ఎఫ్‌లో 690 ఏఎస్ఐ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

    SSC CGL Notification 2021: డిగ్రీ అర్హతతో 6506 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... ఎగ్జామ్ సిలబస్ ఇదే

    BEL Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    స్టెప్‌ 1 లో ముందుగా http://www.mhrdnats.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
    Enroll పైన క్లిక్ చేయండి.
    మీ వివరాలతో అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయండి.
    యూనిక్ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ వస్తుంది.
    ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్, అప్రూవల్ కోసం ఒక రోజు సమయం పడుతుంది. రెండో రోజు రెండో స్టెప్ అప్లికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

    స్టెప్‌ 2 లో http://www.mhrdnats.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి లాగిన్ చేయాలి.
    ఎస్టాబ్లిష్‌మెంట్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అప్‌లోడ్ చేయాలి.
    Bharat Electronics Limited అని టైప్ చేసి అప్లై చేయాలి.

    నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-NATS పోర్టల్‌లో గతంలోనే ఎన్‌రోల్ చేసిన విద్యార్థులు స్టెప్ 2 ఫాలో అయితే చాలు.
    Published by:Santhosh Kumar S
    First published: