BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

BEL Recruitment 2021 | భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బెంగళూరు కాంప్లెక్స్‌లోని స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ అండ్ అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్ ఎస్‌బీయూలో ట్రైనీ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్లను నియమిస్తోంది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. కాంట్రాక్ట్ ఒక ఏడాది మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ప్రాజెక్ట్ అవసరాలు, ఉద్యోగి పనితీరును బట్టి కాంట్రాక్ట్‌ను పొడిగిస్తారు. ట్రైనీ ఇంజనీర్ కాంట్రాక్ట్ మూడేళ్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్ కాంట్రాక్ట్ నాలుగేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. మొత్తం 9 ఖాళీలున్నాయి. బెంగళూరులో పోస్టింగ్ ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 జూన్ 9 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.bel-india.in/ వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చు.

    BEL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 9
    ట్రైనీ ఇంజనీర్- 6
    ప్రాజెక్ట్ ఇంజనీర్- 3

    DRDO Recruitment 2021: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    Railway Jobs: రైల్వేలో ఉద్యోగాల పేరుతో మోసం... 12 మందికి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్స్

    BEL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూన్ 9
    విద్యార్హతలు- ఏరో స్పేస్ లేదా ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో బీఈ, బీటెక్, బీఎస్సీ పాస్ కావాలి. ఎంఈ, ఎంటెక్ పాస్ అయినవారు ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు దరఖాస్తు చేయొచ్చు. వారికి గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఏరో స్పేస్ లేదా ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌ సబ్జెక్ట్స్ ఉండాలి.
    వయస్సు- 2021 మే 1 నాటికి ట్రైనీ ఇంజనీర్ పోస్టుకు 25 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు 28 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
    దరఖాస్తు ఫీజు- ట్రైనీ ఇంజనీర్ పోస్టుకు రూ.200, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు రూ.500.
    ఎంపిక విధానం- క్వాలిఫయింగ్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ.
    వేతనం- ట్రైనీ ఇంజనీర్ పోస్టుకు మొదటి ఏడాది రూ.25,000. రెండో ఏడాది రూ.28,000. మూడో ఏడాది రూ.31,000. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు మొదటి ఏడాది రూ.35,000. రెండో ఏడాది రూ.40,000. మూడో ఏడాది రూ.45,000, నాలుగో ఏడాది రూ.50,000.

    Railway Jobs: రైల్వేలో 3591 జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు

    Teacher Jobs 2021: మొత్తం 7,236 టీచర్ పోస్టుల ఉద్యోగాలకు నేటి నుంచి దరఖాస్తులు

    BEL Recruitment 2021: దరఖాస్తు విధానం


    ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు https://www.bel-india.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    అందులో కెరీర్స్ సెక్షన్‌లో ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ నోటిఫికేషన్ ఉంటుంది.
    నోటిఫికేషన్‌తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది.
    అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీ లోగా పంపాలి.
    దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
    MANAGER(HR/SC&US),
    Bharat Electronics Ltd,
    Jalahalli, Bangalore- 560013.
    Published by:Santhosh Kumar S
    First published: