భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ట్రైనీ ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మిలిటరీ కమ్యూనికేషన్ ఎస్‌బీయూ, బెంగళూరు కాంప్లెక్స్‌లో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2021 మే 21 చివరి తేదీ. ఇవి ఏడాది కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. సంస్థ అవసరాలు, వ్యక్తిగత పనితీరును బట్టి మూడేళ్ల వరకు కాంట్రాక్ట్ పొడిగించొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.bel-india.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. అప్లై చేసేముందు విద్యార్హతలు తెలుసుకోవాలి. అభ్యర్థులు ఇదే వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి. ప్రయాణాలు ఇష్టపడేవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. మొదట్లో బెంగళూరులో పోస్టింగ్ ఉంటుంది. ఈశాన్య భారతదేశం, జమ్మూ అండ్ కాశ్మీర్‌తో పాటు ఫీల్డ్ యాక్టివిటీస్‌లో భాగంగా దేశంలో ఎక్కడికైనా ప్రయాణించాల్సి ఉంటుంది.
Jobs: మొత్తం 567 ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు
AIIMS Recruitment 2021: ఎయిమ్స్‌లో 775 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
ట్రైనీ ఇంజనీర్ మొత్తం ఖాళీలు- 30
జనరల్- 12
ఓబీసీ- 8
ఎస్సీ- 4
ఎస్టీ- 3
ఈడబ్ల్యూఎస్- 3
SBI Clerk Jobs 2021: ఎస్బీఐలో 5454 క్లర్క్ జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు
MES Recruitment 2021: మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్‌లో 572 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మే 21
విద్యార్హతలు- ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఈ అండ్ టీ, టెలీకమ్యూనికేషన్‌లో నాలుగేళ్ల బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి.
అనుభవం- అభ్యర్థులకు 6 ఏళ్లు ఇండస్ట్రీలో పనిచేసిన అనుభవం ఉండాలి.
వయస్సు- 2021 ఏప్రిల్ 1 నాటికి 25 ఏళ్లు
దరఖాస్తు ఫీజు- రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
వేతనం- మొదటి ఏడాది రూ.25,000, రెండో ఏడాది రూ.28,000, మూడో ఏడాది రూ.31,000.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Upcoming jobs