BEL RECRUITMENT 2021 BHARAT ELECTRONICS LIMITED HYDERABAD INVITES APPLICATIONS FOR 84 TRAINEE ENGINEER AND PROJECT ENGINEER POSTS KNOW HOW TO APPLY SS
BEL Recruitment 2021: రూ.50,000 వరకు వేతనంతో హైదరాబాద్‌లోని బీఈఎల్‌లో జాబ్స్
BEL Recruitment 2021: రూ.50,000 వరకు వేతనంతో హైదరాబాద్‌లోని బీఈఎల్‌లో జాబ్స్
BEL Recruitment 2021 | హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తు ప్రక్రియ త్వరలో ముగియనుంది. ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది.కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రీమియర్ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఇది. హైదరాబాద్‌లోని యూనిట్లో ట్రైనీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 84 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 31 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. అంటే పోస్టు ద్వారా దరఖాస్తుల్ని నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, ఖాళీల వివరాలు తెలుసుకోండి.
విద్యార్హతలు- సంబంధిత బ్రాంచ్‌లో బీఈ, బీటెక్, బీఎస్సీ (ఇంజనీరింగ్) పాస్ కావాలి.
అనుభవం- ట్రైనీ ఇంజనీర్ పోస్టుకు ఏడాది, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
వయస్సు- 2021 డిసెంబర్ 31 నాటికి ట్రైనీ ఇంజనీర్ పోస్టుకు 25 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు 28 ఏళ్లు
దరఖాస్తు ఫీజు- ట్రైనీ ఇంజనీర్ పోస్టుకు రూ.200, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు రూ.500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యంగులకు ఫీజు లేదు.
కాంట్రాక్ట్ గడువు- ట్రైనీ ఇంజనీర్ పోస్టుకు ఒక ఏడాది. సంస్థ అవసరాలు, అభ్యర్థి పనితీరును బట్టి మూడేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు రెండేళ్లు. సంస్థ అవసరాలు, అభ్యర్థి పనితీరును బట్టి నాలుగేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది.
వేతనం- ట్రైనీ ఇంజనీర్‌కు మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది నెలకు రూ.28,000, మూడో ఏడాది నెలకు రూ.31,000. ప్రాజెక్ట్ ఇంజనీర్‌కు మొదటి ఏడాది నెలకు రూ.35,000, రెండో ఏడాది నెలకు రూ.40,000, మూడో ఏడాది నెలకు రూ.45,000, నాలుగో ఏడాది నెలకు రూ.50,000.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.