హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

BEL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. BELలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండు రోజులే ఛాన్స్

BEL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. BELలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండు రోజులే ఛాన్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుంచి మరో జాబ్ నోటిఫికేషన్(Job Notification) విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 15 లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిరుద్యోగులకు(Jobs) శుభవార్త చెప్పింది. 80 డిప్లొమో అప్రంటీస్ ఖాళీలను(Apprentice Vacancies) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు పని ఘజియాబాద్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యూనిట్ లో పని చేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై(Online Application) చేసుకోవాలని నోటిఫికేషన్లో(Notification) తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10,400 వరకు స్టైఫండ్(stipend) చెల్లించనున్నట్లు తెలిపారు.

ఖాళీలు విభాగాల వారీగా ఖాళీల వివరాలు..

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 80 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. నవంబర్ 2018 తర్వాత ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఆ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

Bank of India Recruitment 2021: అలర్ట్.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో మూడు రోజులే ఛాన్స్

విభాగం ఖాళీలు
మెకానికల్ ఇంజనీరింగ్20
కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్20
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్20
మోడ్రన్ ఆఫస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటేరీయల్ ప్రాక్టీస్20
మొత్తం:80


ఎలా అప్లై చేయాలంటే..

ఈ ఖాళీలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 25న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీగా నవంబర్ 15ను నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.-అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.mhrdnats.gov.in వెబ్ సైట్లో అప్లికేషన్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

IIT Madras : ఐఐటీ మ‌ద్రాస్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.40,000, ద‌ర‌ఖాస్తుకు రేపే ఆఖ‌రు తేదీ

- ఇందు కోసం ఈ కింది డాక్యుమెంట్లు, వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

1.ఆధార్ కార్డు (Aadhaar)

2.డిప్లొమా సర్టిఫికేట్

3.పాస్ పోర్ట్ సైజ్ ఫొటో

4.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఖాతా వివరాలు.

5.ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్.

NPCIL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో 250 ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండి వరకే ఛాన్స్

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు డిప్లొమాలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, జాయినింగ్ కు సంబంధించిన సమాచారాన్ని రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు చేసుకున్న మెయిల్ ద్వారా తెలియజేస్తారు.

First published:

Tags: Bharat Electronics Limited, Central Government Jobs, Government jobs, Job notification

ఉత్తమ కథలు