Home /News /jobs /

BEL RECRUITMENT 2021 APPLICATIONS INVITING FOR 10 NEW VACANCIES HERE FULL DETAILS NS

BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్ లో రూ.55 వేల వేతనంతో జాబ్స్.. ఇలా అప్లై చేయండి

భారత్ ఎలక్ట్రానిక్స్ లో రూ.55 వేల వేతనంతో జాబ్స్.. ఇలా అప్లై చేయండి

భారత్ ఎలక్ట్రానిక్స్ లో రూ.55 వేల వేతనంతో జాబ్స్.. ఇలా అప్లై చేయండి

ఇటీవల భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుంచి వరుసగా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు జనవరి 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.

    భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగంలో ఈ ఖాళీలను (Jobs) భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు జనవరి 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, Pw BD అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. ఎంపికైన అభ్యర్థులు నాలుగేళ్ల పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 40 వేల నుంచి రూ. 55 వేల వరకు వేతనం చెల్లిస్తారు.
    MIDHANI Recruitment 2021: హైదరాబాద్ లో మిధానిలో జాబ్స్.. బీఈ, బీటెక్, ఎంబీఏ, డిప్లొమా చేసిన వారికి భారీ వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు 55 శాతం మార్కులతో ఈ విద్యార్హతను పొంది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, PwBD అభ్యర్థులు పాసై ఉంటే సరిపోతుంది.
    AP Job Mela: ఏపీలో రేపు జాబ్ మేళా.. ఇంటర్ అర్హతతో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి.. పూర్తి వివరాలివే

    ఎలా అప్లై చేయాలంటే..
    Steps 1: అభ్యర్థులు మొదటగా https://www.bel-india.in/Default.aspx ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం Careers విభాగంలో Recruitment-Advertisements సెలక్ట్ చేసుకోవాలి.
    Step 3: అనంతరం ఈ లింక్స్ (Link 1 & Link 2) పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
    Step 4: అనంతరం అప్లికేషన్ ఫామ్ ను నింపాలి. ఆ అప్లికేషన్ పామ్ కు నోటిఫికేషన్లో సూచించిన డాక్యుమెంట్లను జత చేసి పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది.
    ONGC Recruitment 2021: ONGCలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో మూడు రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి



    అప్లికేషన్ ఫామ్ ను Senior Deputy General Manager (HR), Naval Systems SBU, Bharat Electronics Limited, Jalahalli Post, Bangalore 560013, Karnataka చిరునామకు జనవరి 6లోగా పింపించాల్సి ఉంటుంది.
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు