Home /News /jobs /

BEL RECRUITMENT 2021 APPLICATION PROCESS ENDS SOON FOR PROJECT ENGINEERS AND TRAINEE ENGINEER POSTS IN BHARAT ELECTRONICS LIMITED KNOW HOW TO APPLY SS

BEL Recruitment 2021: రూ.50,000 వరకు వేతనంతో జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

BEL Recruitment 2021: రూ.50,000 వరకు వేతనంతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో జాబ్స్
(ప్రతీకాత్మక చిత్రం)

BEL Recruitment 2021: రూ.50,000 వరకు వేతనంతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో జాబ్స్ (ప్రతీకాత్మక చిత్రం)

BEL Recruitment 2021 | బీటెక్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయినవారికి అలర్ట్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (Bharat Electronics Limited) ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అప్లై చేయడానికి మరో 3 రోజులే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని నవరత్న కంపెనీ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (Bharat Electronics Limited) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ఆగ్రా స్మార్ట్ సిటీ హెల్ప్ డెస్క్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, బెంగళూరులోని స్మార్ట్ సిటీ బిజినెస్ ఎస్‌బీయూ కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 14 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 8 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.















    మొత్తం ఖాళీలు14
    ట్రైనీ ఇంజనీర్ 110
    ప్రాజెక్ట్ ఇంజనీర్4

    Jobs in Wipro: విప్రోలో ఫ్రెషర్స్‌కి 30,000 ఉద్యోగాలు... ఏడాదికి రూ.3,50,000 వేతనం

    BEL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 8

    విద్యార్హతలు- ట్రైనీ ఇంజనీర్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, టెలీకమ్యూనికేషన్, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి.

    వయస్సు- ట్రైనీ ఇంజనీర్ పోస్టుకు గరిష్టంగా 25 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు గరిష్టంగా 28 ఏళ్లు.

    వేతనం- ట్రైనీ ఇంజనీర్ పోస్టుకు మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది నెలకు రూ.28,000, మూడో ఏడాది నుంచి నెలకు రూ.31,000 చొప్పున వేతనం లభిస్తుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు మొదటి ఏడాది నెలకు రూ.35,000, రెండో ఏడాది నెలకు రూ.40,000, మూడో ఏడాది నెలకు రూ.45,000 చొప్పున, నాలుగో ఏడాది నుంచి నెలకు రూ.50,000 చొప్పున వేతనం లభిస్తుంది.

    Inspire Fellowship: ఇన్‌స్పైర్ ఫ్యాకల్టీ ఫెలోషిప్... నెలకు రూ.1,25,000 స్టైపెండ్... అప్లై చేయండి ఇలా

    BEL Recruitment 2021: అప్లై చేయండి ఇలా...


    Step 1- ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు బీఈఎల్ వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేయాలి.
    Step 2- డీటెయిల్డ్ అడ్వర్టైజ్‌మెంట్ పైన క్లిక్ చేయాలి.
    Step 3- నోటిఫికేషన్ చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
    Step 4- ఆ తర్వాత Click here to Apply పైన క్లిక్ చేయాలి.
    Step 5- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
    Step 6- లేదా నేరుగా https://register.cbtexams.in/BEL/PEAgra లింక్ క్లిక్ చేసి కూడా అప్లై చేయొచ్చు.
    Step 7- మొదటి దశలో ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేయాలి.
    Step 8- అభ్యర్థి తన మొబైల్ నెంబర్, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
    Step 9- రెండో దశలో విద్యార్హతల వివరాలు ఎంటర్ చేసి, దరఖాస్తు చేయాల్సిన పోస్టు పేరు సెలెక్ట్ చేయాలి.
    Step 10- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
    Step 11- దరఖాస్తు ఓసారి సరిచూసుకొని ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
    Step 12- దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

    ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఏవైనా సందేహాలు, ఫీజు చెల్లింపులో సమస్యలు ఉంటే hrtbs@bel.co.in మెయిల్ ఐడీలో లేదా 080-22195629 ఫోన్ నెంబర్‌లో సంప్రదించాలి. దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయడంలో ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే Cbtexamhelpdesk@gmail.com మెయిల్ ఐడీ లేదా హెల్ప్ డెస్క్ 8866678549 లేదా 8866678559 నెంబర్లలో సంప్రదించొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bharat Electronics Limited, CAREER, Govt Jobs 2021, Job notification, JOBS

    తదుపరి వార్తలు