BEL Recruitment 2020: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

BEL Recruitment 2020 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: August 27, 2020, 5:09 PM IST
BEL Recruitment 2020: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
BEL Recruitment 2020: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పూణెలోని యూనిట్‌లో ట్రైనీ ఇంజనీర్, ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 18 ఖాళీలున్నాయి. ఎంబీఏ, బీటెక్, ఎంటెక్ లాంటి కోర్సులు పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 15 చివరి తేదీ. దరఖాస్తును స్కాన్ చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన ఇమెయిల్ అడ్రస్‌కు మెయిల్ చేయాలి. ఆ తర్వాత అదే దరఖాస్తు ఫామ్‍ను నోటిఫికేషన్‌లో వెల్లడించిన పోస్టల్ అడ్రస్‌కు పంపాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://bel-india.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

BEL Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 18
ట్రైనీ ఇంజనీర్- 9
ట్రైనీ ఆఫీసర్- 2
ప్రాజెక్ట్ ఇంజనీర్- 6
ప్రాజెక్ట్ ఆఫీసర్- 1Work From Home Jobs: ఉద్యోగం లేదా? ఇంటి నుంచే పనిచేస్తూ డబ్బు సంపాదించండి ఇలా

NHPC Recruitment 2020: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో 86 ట్రైనీ ఉద్యోగాలు

BEL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇవే...


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 15
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత విభాగంలో బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజనీరింగ్, ఎంబీఏ లాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి.
దరఖాస్తు ఫీజు- ప్రాజెక్ట్ ఇంజనీర్, ఆఫీసర్ పోస్టులకు రూ.500. ట్రైనీ ఇంజనీర్, ఆఫీసర్ పోస్టులకు రూ.200.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Sr. Dy. General Manager (HR&A),
Bharat Electronics Limited,
N.D.A.Road, Pashan,
Pune- 411021, Maharashtra.
Published by: Santhosh Kumar S
First published: August 27, 2020, 5:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading