BEL Recruitment 2020: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 78 ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ఖాళీలు

BEL Recruitment 2020 | ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, సివిల్ లాంటి విభాగాల్లో డిప్లొమా, బీటెక్ పాసైనవారికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు ఉన్నాయి. నోటిఫికేషన్ల వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: October 20, 2020, 10:42 AM IST
BEL Recruitment 2020: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 78 ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ఖాళీలు
BEL Recruitment 2020: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 78 ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ఖాళీలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. హైదరాబాద్‌లోని యూనిట్‌తో పాటు చెన్నై, ఘజియాబాద్ లాంటి యూనిట్లలో ఖాళీలున్నాయి. మొత్తం 78 పోస్టుల్ని భర్తీ చేస్తోంది బీఈఎల్. ఈ పోస్టులకు నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. చివరితేదీ ఎప్పుడో సంబంధిత నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. ఎంపికైనవారికి రూ.1,20,000 వరకు వేతనం లభిస్తుంది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ https://bel-india.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.

హైదరాబాద్‌లోని యూనిట్‌లో సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలీకమ్యూనికేషన్‌లో మూడేళ్ల డిప్లొమా పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 అక్టోబర్ 31 చివరి తేదీ. ఎంపికైన వారికి రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు వేతనం లభిస్తుంది.

Jobs: ఈ కోర్సు చేసినవారికి లక్ష ఉద్యోగాలు... కరోనా వైరస్ ఎఫెక్ట్

Job Loss: కరోనా కాలంలో ఉద్యోగం పోతే ప్రభుత్వం నుంచి సాయం... పథకాన్ని పొడిగించిన కేంద్రం

ఘజియాబాద్‌లోని యూనిట్‌లో కూడా 10 సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులున్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సిగ్నల్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులు పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 24 లాస్ట్ డేట్. ఎంపికైన వారికి రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు వేతనం లభిస్తుంది.

చెన్నైలోని యూనిట్‌లో ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ, ప్రాజెక్ట్ ఆఫీసర్ లాంటి 23 పోస్టులున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, టెలీకమ్యూనికేషన్ లేదా కమ్యూనికేషన్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాల్లో బీటెక్ కోర్సులు పాసైనవారు అప్లై చేయొచ్చు. దరఖాస్తు చేయడానికి 2020 అక్టోబర్ 30 లాస్ట్ డేట్. ఎంపికైనవారికి రూ.50,000 వేతనం లభిస్తుంది.

Army Public School Jobs: టీచర్ జాబ్ మీ కలా? ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో 8000 ఉద్యోగాలకు 3 రోజుల్లో అప్లై చేయండి

AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే

కోట్‌ద్వారా లో 33 ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ, ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, టెలీకమ్యూనికేషన్ లేదా కమ్యూనికేషన్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాల్లో బీటెక్ కోర్సులు పాసైనవారు అప్లై చేయొచ్చు. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 21 చివరి తేదీ.

చెన్నై, ఘజియాబాద్‌ యూనిట్‌లో 11 హవిల్దార్ పోస్టులున్నాయి. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 24 లాస్ట్ డేట్.
Published by: Santhosh Kumar S
First published: October 20, 2020, 10:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading