హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main: త్వరలో జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు.. ఈ ఏడాది తీసుకువచ్చిన ప్రధాన మార్పులు ఇవే..

JEE Main: త్వరలో జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు.. ఈ ఏడాది తీసుకువచ్చిన ప్రధాన మార్పులు ఇవే..

జేఈఈ (JEE) మెయిన్ -2022 కోసం అనేక మార్పులు చేశారు. పరీక్ష కేంద్రాలు మొదలుకొని టై-బ్రేకింగ్ పాలసీ వరకు.. ఈ ఏడాది ప్రవేశపెట్టిన కొత్త మార్పులను పరిశీలిద్దాం.

జేఈఈ (JEE) మెయిన్ -2022 కోసం అనేక మార్పులు చేశారు. పరీక్ష కేంద్రాలు మొదలుకొని టై-బ్రేకింగ్ పాలసీ వరకు.. ఈ ఏడాది ప్రవేశపెట్టిన కొత్త మార్పులను పరిశీలిద్దాం.

జేఈఈ (JEE) మెయిన్ -2022 కోసం అనేక మార్పులు చేశారు. పరీక్ష కేంద్రాలు మొదలుకొని టై-బ్రేకింగ్ పాలసీ వరకు.. ఈ ఏడాది ప్రవేశపెట్టిన కొత్త మార్పులను పరిశీలిద్దాం.

జాతీయ స్థాయిలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం జేఈఈ నిర్వహిస్తారు. ఈ ఏడాదికి సంబంధించిన మొదటి సెషన్ పరీక్షలు జూన్ 20 నుంచి 29 మధ్య జరుగుతాయి. పరీక్షకు మరో ఐదు రోజులే ఉండడంతో అడ్మిట్ కార్డును ఏన్‌టీఏ ఎప్పుడైనా జారీ చేసే అవకాశం ఉంది. వీటిని విడుదల చేసిన తరువాత సంస్థ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in.లో అందుబాటులో ఉంటాయి. జేఈఈ మెయిన్ -2022 కోసం అనేక మార్పులు చేశారు. పరీక్ష కేంద్రాలు మొదలుకొని టై-బ్రేకింగ్ పాలసీ వరకు.. ఈ ఏడాది ప్రవేశపెట్టిన కొత్త మార్పులను పరిశీలిద్దాం.

ఎగ్జామ్ సిటీ ఎంపిక

జేఈఈ-2022 కోసం విద్యార్థులు మరిన్ని పరీక్ష రాసే నగరాలను ఎంపిక చేసుకోవడానికి ఎన్‌టీఏ అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఉన్న 13 నగరాలకు అదనంగా విదేశాల్లోని మరో 12 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. దరఖాస్తు చేసుకునే సందర్భంలో అభ్యర్థులు తమకు సౌకర్యంగా ఉండే ఏవైనా నాలుగు పరీక్ష నగరాలను ఎంచుకోవాలి. అయితే, ఆ సిటీల ఎంపిక అభ్యర్థి శాశ్వత చిరునామా రాష్ట్రానికి సంబంధించినవి మాత్రమే ఉండాలి.

ప్రాంతీయ భాషలు

ఎన్‌టీఏ గత కొన్ని సంవత్సరాల నుంచి జేఈఈ కోసం ప్రాంతీయ భాషల ఎంపికలను పెంచుకుంటూ వస్తుంది. 2021 జేఈఈ మెయిన్ ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, గుజరాతీ, ఒడియా, మలయాళం, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ ఇలా మొత్తం 13 భాషల్లో నిర్వహించారు. JEE మెయిన్ కోసం మరిన్ని భాషలను జాబితాలో చేర్చాలని రాష్ట్రాల అభ్యర్థన మేరకు ఎన్‌టీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ భాషను ఎంచుకున్న అభ్యర్థులకు ఆ రాష్ట్రంలోనే పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. దేశవ్యాప్తంగా అన్ని సెంటర్లలో ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ భాషల్లో జేఈఈ నిర్వహించనున్నారు.

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా..? అయితే ఈ GK ప్రశ్నలకు సమాధానం మీకు తెలుసా..!


ప్రయత్నాల తగ్గింపు (ATTEMPTS REDUCED)

JEE మెయిన్-2022 కోసం NTA ప్రవేశపెట్టిన అనేక మార్పులను అభ్యర్థులు పెద్దగా స్వాగతించలేదు. అందులో ప్రధానంగా ప్రతి అభ్యర్థికి అనుమతించిన ప్రయత్నాల సంఖ్యను తగ్గించడంపై అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. JEE మెయిన్ 2022లో రెండుసార్లు మాత్రమే నిర్వహించనున్నారు. కాగా, 2020లో కరోనా కారణంగా నాలుగు సెషన్లలో నిర్వహించారు. అంతకు ముందు కేవలం JEE మెయిన్‌‌కు ఒక సెషన్ మాత్రమే ఉండేది.

పుతిన్ మలమూత్రాలను సేకరించేందుకు స్పెషల్‌ బాడీగార్డు.. చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ


టై-బ్రేకింగ్ పాలసీ

జేఈఈ మెయిన్ -2022 కోసం టై-బ్రేకర్ విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. టై అయిప్పుడు విద్యార్థుల స్కోర్‌ను బ్రేక్ చేయడానికి గతంలో ఉన్న విధానాన్ని ఎన్‌టీఏ తిరిగి తీసుకొచ్చింది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే మార్కులను స్కోర్ చేసినప్పుడు.. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా నెగెటివ్ మార్కింగ్‌ మార్కులతో సహా ఇతర మార్గాల ద్వారా టై పరిష్కరించలేకపోతే, JEE మెయిన్‌కు ముందు దరఖాస్తు చేసిన అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వయసు నిబంధనలను ఈసారి అమలు చేయనున్నారు.

WhatsApp యూజర్లకు అలర్ట్.. మళ్లీ తెరపైకి ఓల్డ్ స్కామ్.. అప్రమత్తంగా లేకుంటే డబ్బులన్నీ గల్లంతే..!


కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియ

ఈ ఏడాది జేఈఈ మెయిన్‌ రిజిస్ట్రేషన్‌లో మార్పులు చేశారు. గతంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఒకదశలో ఉండగా, ఇప్పుడు మూడు దశలుగా మార్చారు. మొదటి దశలో అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవడానికి పోర్టల్‌లో తమను తాము నమోదు చేసుకోవాలి. రెండో దశలో, అభ్యర్థులు వ్యక్తిగత వివరాలను పూరించడం, దరఖాస్తు చేయడం, పరీక్ష నగరాలను ఎంచుకోవడంతో సహా దరఖాస్తు ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుంది. చివరి మూడో దశలో రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.

Published by:Mahesh
First published:

Tags: EDUCATION, Engineering course, Jee mains, Jee mains 2022

ఉత్తమ కథలు