భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) 500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నొయిడా(Noida) కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ ఇన్వెస్టిగేటర్(Investigator), సూపర్‌వైజర్(Supervisor) పోస్టుల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు BECIL అధికారిక వెబ్సైట్ www.becil.com ద్వారా జనవరి 25లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ త్వర్వాత అప్లికేషన్‌ను projecthr@becil.com మెయిల్ అడ్రస్‌కు ఈ–మెయిల్ ద్వారా పంపించాలి. కాగా, ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఆ తర్వాత సంస్థ అవసరం, అభ్యర్థి పనితీరును బట్టి కాంట్రాక్ట్ వ్యవధిని పొడిగిస్తారు. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలను పరిశీలించండి.
ఖాళీల వివరాలు..
ఇన్వెస్టిగేటర్ – 350 పోస్టులు, సూపర్‌వైజర్లు – 150 పోస్టులు.
అర్హత ప్రమాణాలు..
ఇన్వెస్టిగేటర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. అంతేకాదు, కంప్యూటర్‌పై మంచి వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. సూపర్‌వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 50 ఏళ్లు మించకూడదు.
IBPS Exam Calendar 2022: నిరుద్యోగులకు అలర్ట్... ఈ ఏడాది రాబోయే బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్స్ ఇవే
ఎంపిక ప్రక్రియ..
అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టుల వారీగా వచ్చిన అప్లికేషన్లను స్క్రీనింగ్ చేసి, వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అయితే, అప్లికేషన్లు ఎక్కువగా వస్తే.. రాత పరీక్ష కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ, రాత పరీక్ష నిర్వహించాలని భావిస్తే.. ముందుగానే దరఖాస్తుదారులకు సమాచారం అందజేస్తారు. రాత పరీక్ష ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు..
జనరల్/ఓబీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీ అభ్యర్థులు రూ. 500 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/పీహెచ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ. 350 చెల్లించాల్సి ఉంటుంది.
జీత భత్యాలు..
ఇన్వెస్టిగేటర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెలా రూ. 24,000 జీతం అందుతుంది. సూపర్‌వైజర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెలా రూ. 30000 జీతం అందజేస్తారు. ఎటువంటి అలవెన్సులు ఉండవు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.