బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (BECIL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ-టెండరింగ్ ప్రొఫెషనల్, ఫైనాన్స్ ఫెసిలిటేషన్ ప్రొఫెషనల్ మరియు ఆఫీస్ అటెండెంట్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో (Job Notification) పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తుకు ఈ నెల 21ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ becil.comలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
క్ర.సం. | విభాగం | ఖాళీలు |
1. | ఈ టెండరింగ్ ప్రొఫెషనల్ | 12 |
2. | ఫైనాన్స్ ఫెసిలిటేషన్ ప్రొఫెషనల్ | 12 |
3. | ఆఫీస్ అటెండెంట్ | 6 |
మొత్తం: | 30 |
వయోపరిమితి:
ఈ-టెండరింగ్ ప్రొఫెషనల్/ఫైనాన్స్ ఫెసిలిటేషన్ ప్రొఫెషనల్: 50 సంవత్సరాలు
ఆఫీస్ అటెండెంట్: 21 సంవత్సరాలు
TCS: టీసీఎస్ కీలక ప్రకటన..70 శాతం మంది ఉద్యోగులకు వంద శాతం వేరియబుల్ పే!
విద్యార్హత:
ఈ-టెండరింగ్ ప్రొఫెషనల్: B.E./B.Tech.
ఫైనాన్స్ ఫెసిలిటేషన్ ప్రొఫెషనల్: MBA / ICWA / B.Com, MSME సెక్టార్ కోసం బ్యాంకుల పరిజ్ఞానం.
ఆఫీస్ అటెండెంట్: కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. స్థానిక భాషా పరిజ్ఞానం ఉండాలి.
దరఖాస్తు రుసుము: జనరల్ / OBC / మాజీ-సర్వీస్‌మెన్ / మహిళా అభ్యర్థులు రూ. 885 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది, అయితే SC / ST / EWS / PH కేటగిరీ అభ్యర్థులకు రూ. 531 వర్తిస్తుంది.
ఎలా దరఖాస్తు చేయాలంటే:
Step 1: becilregistration.com వెబ్ సైట్లో BECIL యొక్క రిజిస్ట్రేషన్ పేజీని సందర్శించండి.
Step 2: కొత్త రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించండి.
Step 3: నమోదు చేసుకున్న తర్వాత, పోర్టల్‌కు లాగిన్ చేసి దరఖాస్తు చేసుకోండి.
Step 4: అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి, రుసుము చెల్లించి, ఫారమ్‌ను సమర్పించండి.
Step 5: భవిష్యత్ అవసరాల కోసం ప్రింటవుట్ తీసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.