BECIL RECRUITMENT 2021 NOTIFICATION RELEASED FOR VARIOUS JOB VACANCIES AT BECIL HERE DETAILS NS
BECIL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. బీఈసీఐఎల్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్
నిరుద్యోగులకు అలర్ట్.. బీఈసీఐఎల్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్
బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. సంస్థ నుంచి ఇటీవల వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notification) విడుదలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా పశ్చిమ బెంగాల్, కళ్యాణిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్-AIIMS)లో ఒప్పంద ప్రాతిపదికన 80 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా యూడీసీ, లేబొరేటరీ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్, ఇతర పోస్టులను BECIL భర్తీ చేయనుంది. అభ్యర్థులు డిసెంబర్ 18లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం www.becil.com ను సందర్శించాలని బీఈసీఐఎల్ కోరింది.
-దరఖాస్తు ఫారమ్‌ను విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కింద రూ. 750 చెల్లించాలి. ప్రతి అదనపు పోస్టుకు, అభ్యర్థులు రూ. 500 ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.
-అభ్యర్థులు భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్‌ను ప్రింటవుట్ తీసుకోవాలి.
-ఈ అప్లికేషన్ ఆన్లైన్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కళ్యాణిలోని ఎయిమ్స్ కోసం బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ప్రత్యేకంగా ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని బీఈసీఐఎల్ అధికారులు సూచించారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే, -khuswindersingh@becil.com, maheshchand@becil.com మెయిల్ ఐడిలను సంప్రదించాలని కోరారు. లేదా బీఈసీఐఎల్కు సంబంధించిన మొబైల్ నంబర్ 0120-4177860కు కూడా సంప్రదించవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.