• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • BECIL RECRUITMENT 2021 NOTIFICATION RELEASED FOR ASST EDITOR PROOF READER OTHER POSTS NS

BECIL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. BECIL నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి తాజాగా సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) నుంచి ఇటీవల ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా సంస్థ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎడిటర్, అసిస్టెంట్ ఎడిటర్, ప్రూఫ్ రీడర్, బిజినెస్ ఎగ్జిక్యూటీవ్, మార్కెటింగ్ సూపర్వైజర్ తదితర ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు జులై 7ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    DRDO DRL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి
    AP Job Calendar: నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త.. 10,143 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల.. ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుందంటే..

    ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..
    ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
    ఎడిటర్-2 పోస్టులు
    అసిస్టెంట్ ఎడిటర్-2 పోస్టులు
    ప్రూఫ్ రీడర్ - 2 పోస్టులు
    బిజినెస్ ఎగ్జిక్యూటీవ్ - 2 పోస్టులు
    మార్కెటింగ్ సూపర్ వైజర్- 2 పోస్టులు

    విద్యార్హతల వివరాలు..
    ఎడిటర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. గ్రాడ్యుయేషన్ లెవల్ లో అభ్యర్థులు ఇంగ్లిష్ ను సబ్జెక్టుగా కలిగి ఉండాలి.
    అసిస్టెంట్ ఎడిటర్: అభ్యర్థులు గ్రాడ్యుయేట్ డిగ్రీ పొంది ఉండాలి. జర్నలిజం/పబ్లిషింగ్ లో అనుభవం ఉండాలి.

    ప్రూఫ్ రీడర్: డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. ఇంగ్లిష్/హిందీలో నాలెడ్జ్ ఉండాలి.
    బిజినెస్ ఎగ్జిక్యూటీవ్: గ్రాడ్యుయేషన్ తో పాటు అడ్వర్టైజ్మెంట్ అండ్ మార్కెటింగ్ లో పీజీ డిప్లొమో చేసి ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
    మార్కెటింగ్ సూపర్వైజర్: ఎంకామ్ తో పాటు బుక్ మార్కెటింగ్ లో నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
    Official Website - Direct Link
    Application - Direct Link

    ఎలా అప్లై చేయాలంటే..
    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో జులై 7లోగా అప్లై చేయాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published: