Home /News /jobs /

BECIL RECRUITMENT 2021 APPLICATIONS INVITING FOR VARIOUS JOB VACANCIES AT BECIL DEC 18 IS LAST DATE FOR APPLICATIONS HERE DETAILS NS

BECIL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. బీఈసీఐఎల్‌ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండు రోజులే ఛాన్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) నుంచి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఈ నెల 18ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.

    బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. సంస్థ నుంచి ఇటీవల వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notification) విడుదలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా పశ్చిమ బెంగాల్​, కళ్యాణిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌ (ఎయిమ్స్-AIIMS​)లో ఒప్పంద ప్రాతిపదికన 80 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. దీని ద్వారా యూడీసీ, లేబొరేటరీ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్, ఇతర పోస్టులను BECIL భర్తీ చేయనుంది. అభ్యర్థులు డిసెంబర్ 18లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం www.becil.com ను సందర్శించాలని బీఈసీఐఎల్​ కోరింది.

    ఏ పోస్టులో ఎన్ని ఖాళీలు?



































    పోస్టు ఖాళీలు
    ల్యాబరేటరీ టెక్నీషియన్​33
    లైబ్రేరియన్​ గ్రేడ్​03
    మెడికల్ రికార్డ్​ టెక్నీషియన్​02
    గ్యాస్​ స్టీవార్డ్​01
    అప్పర్ డివిజన్​ క్లర్క్​/డేటా ఎంట్రీ ఆపరేటర్​36
    స్టోర్​ కీపర్​ కమ్​ క్లర్క్​03
    ఫార్మాసిస్ట్02

    BSNL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. BSNLలో 55 ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

    ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
    Step 1: ముందుగా బీఈసీఐఎల్​ అధికారిక వెబ్‌సైట్- www.becil.comకి వెళ్లండి.
    Step 2: కెరీర్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. ఒక కొత్త విండో ఓపెన్​ అవుతుంది.
    Step 3: ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫారమ్ (ఆన్‌లైన్ దరఖాస్తు) పై క్లిక్ చేయండి.
    Step 4: ముందు రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తి చేసి, ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్​ను పూరించాల్సి ఉంటుంది.
    DRDO Recruitment 2021: డీఆర్డీఓలో జాబ్స్.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. కేవలం మార్కుల ఆధారంగానే ఎంపిక.. వివరాలివే

    Step 4: రిజిస్ట్రేషన్​ ప్రక్రియలో భాగంగా అడ్వర్టైజ్‌మెంట్ నంబర్, అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, ఇతర వివరాలను నమోదు చేయాలి.
    Step 5: ఆ తరువాత, అభ్యర్థులు అవసరమైన అన్ని వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్​లోడ్​ చేయాలి.
    Bank Jobs 2021: నిరుద్యోగులకు శుభవార్త.. యూనియన్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి

    -దరఖాస్తు ఫారమ్​ను విజయవంతంగా సబ్​మిట్ చేసిన తర్వాత అభ్యర్థులు అప్లికేషన్​ ఫీజు కింద రూ. 750 చెల్లించాలి. ప్రతి అదనపు పోస్టుకు, అభ్యర్థులు రూ. 500 ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.
    -అభ్యర్థులు భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్​ను ప్రింటవుట్​ తీసుకోవాలి.

    -ఈ అప్లికేషన్ ఆన్‌లైన్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కళ్యాణిలోని ఎయిమ్స్ కోసం బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ప్రత్యేకంగా ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపట్టింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని బీఈసీఐఎల్​ అధికారులు సూచించారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే, -khuswindersingh@becil.com, maheshchand@becil.com మెయిల్ ఐడిలను సంప్రదించాలని కోరారు. లేదా బీఈసీఐఎల్​కు సంబంధించిన మొబైల్​ నంబర్​ 0120-4177860కు కూడా సంప్రదించవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు