బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) నుంచి ఇటీవలి కాలంలో వరుసగా నోటిఫికేషన్లు (Job Notification) విడుదలవుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్, కళ్యాణిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్-AIIMS)లో ఒప్పంద ప్రాతిపదికన 80 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా యూడీసీ, లేబొరేటరీ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్, ఇతర పోస్టులను BECIL భర్తీ చేయనుంది. అభ్యర్థులు డిసెంబర్ 18లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం www.becil.com ను సందర్శించాలని బీఈసీఐఎల్ కోరింది.
ఏ పోస్టులో ఎన్ని ఖాళీలు?
పోస్టు | ఖాళీలు |
ల్యాబరేటరీ టెక్నీషియన్ | 33 |
లైబ్రేరియన్ గ్రేడ్ | 03 |
మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ | 02 |
గ్యాస్ స్టీవార్డ్ | 01 |
అప్పర్ డివిజన్ క్లర్క్/డేటా ఎంట్రీ ఆపరేటర్ | 36 |
స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ | 03 |
ఫార్మాసిస్ట్ | 02 |
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
Step 1: ముందుగా బీఈసీఐఎల్ అధికారిక వెబ్‌సైట్- www.becil.comకి వెళ్లండి.
Step 2: కెరీర్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది.
Step 3: ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫారమ్ (ఆన్‌లైన్ దరఖాస్తు) పై క్లిక్ చేయండి.
Step 4: ముందు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి, ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుంది.
CDAC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. C-DACలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి
Step 4: రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా అడ్వర్టైజ్‌మెంట్ నంబర్, అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, ఇతర వివరాలను నమోదు చేయాలి.
Step 5: ఆ తరువాత, అభ్యర్థులు అవసరమైన అన్ని వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
SBI CBO Recruitment 2021: ఎస్‌బీఐలో 1,226 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
-దరఖాస్తు ఫారమ్‌ను విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కింద రూ. 750 చెల్లించాలి. ప్రతి అదనపు పోస్టుకు, అభ్యర్థులు రూ. 500 ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.
-అభ్యర్థులు భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్‌ను ప్రింటవుట్ తీసుకోవాలి.
-ఈ అప్లికేషన్ ఆన్‌లైన్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కళ్యాణిలోని ఎయిమ్స్ కోసం బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ప్రత్యేకంగా ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపట్టింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని బీఈసీఐఎల్ అధికారులు సూచించారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే, -khuswindersingh@becil.com, maheshchand@becil.com మెయిల్ ఐడిలను సంప్రదించాలని కోరారు. లేదా బీఈసీఐఎల్కు సంబంధించిన మొబైల్ నంబర్ 0120-4177860కు కూడా సంప్రదించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aiims, Central Government Jobs, Job notification, JOBS