Home /News /jobs /

BECIL Recruitment 2021: 5వ తరగతి, టెన్త్, డిగ్రీ అర్హతతో జాబ్స్.. రూ. 20 వేల వరకు వేతనం.. ఇలా అప్లై చేయండి

BECIL Recruitment 2021: 5వ తరగతి, టెన్త్, డిగ్రీ అర్హతతో జాబ్స్.. రూ. 20 వేల వరకు వేతనం.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్ట్సెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్ట్సెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) నుంచి ఉద్యోగాల భర్తీకి ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల అవుతున్నాయి. తాజాగా ఆయుష్ మంత్రిత్వ శాఖలో పలు ఉద్యోగాల (Jobs) భర్తీకి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS), హౌస్ కీపింగ్ స్టాఫ్, మాలి (Mali), సూపర్ వైజర్, గార్బేజ్ కలెక్టర్ తదితర ఖాళీల భర్తీకి దరఖాస్తులు (Job Applications) ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్లో (Notifications) పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఖాళీలు 32 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. ఈ నెల 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని స్పష్టం చేశారు.

    ఖాళీలు విద్యార్హతల వివరాలు..

































    పోస్టు ఖాళీలు వేతనం
    మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 32 రూ. 17,537
    హౌస్ కీపింగ్ స్టాఫ్ 20 రూ.15,908
    మాలి(Mali) 01 రూ.15,908
    సూపర్ వైజర్ 01 రూ.20,976
    గార్బేజ్ కలెక్టర్ 01 రూ.15,908

    విద్యార్హతల వివరాలు..
    వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
    మల్టీ టాస్కింగ్ స్టాఫ్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
    హౌస్ కీపింగ్ స్టాఫ్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 5వ తరగతి పాసైన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    మాలి(Mali): గుర్తింపు పొందిన బోర్డు నుంచి 5వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
    సూపర్ వైజర్: గుర్తింపు పొందిన యూనిర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ విభాగంలోని ఖాళీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
    గార్బేజ్ కలెక్టర్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 5 వ తరగతి పాసైన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    Cochin Shipyard Recruitment 2021: కొచ్చిన్ షిప్ యార్డ్ లో భారీ వేతనంతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండు రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

    ఎలా అప్లై చేయాలంటే..
    Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://www.becil.com/ ను ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం Careers ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 3: అనంతరం Registration Form(Online Apply) అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 4: తర్వాత అడ్వర్టైజ్మెంట్ నంబర్ (ADVERTISEMENT NO. 96) ను సెలక్ట్ చేసుకోవాలి.
    Step 5: తర్వాత అప్లికేషన్ ఫామ్ లో సూచించిన విధంగా బేసిక్ వివరాలను నమోదు చేయాలి.
    NHPC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. NHPCలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి

    అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


    Step 6:
    తర్వాత విద్యార్హతల వివరాలను నమోదు చేయాలి.
    Step 7: స్కాన్ ఫొటో, సంతకం, పుట్టిన తేదీ, టెన్త్ సర్టిఫికేట్, కుల ధ్రువీకరణ పత్రాల స్కానింగ్ కాపీలను అప్ లోడ్ చేయాలి.
    Step 8: అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూను ఓ సారి చూసుకోవాలి. ఏమైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు.
    Step 9: అనంతరం అప్లికేషన్ ఫీజు రూ. 750ని చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, EWS, PH అభ్యర్థులు రూ. 450 చెల్లిస్తే సరిపోతుంది.
    Step 10: తర్వాత అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవాలి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, Government jobs, Job notification

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు