Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో జాబ్స్... ఖాళీల వివరాలివే

BECIL Recruitment 2020 | ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు https://www.becil.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్‌ను చివరి తేదీ లోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.

news18-telugu
Updated: February 14, 2020, 6:15 PM IST
Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో జాబ్స్... ఖాళీల వివరాలివే
Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో జాబ్స్... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సర్వేయర్, ప్రోగ్రామర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 77 ఖాళీలను ప్రకటించింది. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 17 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు https://www.becil.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్‌ను చివరి తేదీ లోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.

BECIL Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 77

సర్వేయర్- 75
ప్రోగ్రామర్- 2
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 17


విద్యార్హత- సర్వేయర్ పోస్టుకు సర్వేయింగ్‌లో రెండేళ్ల డిప్లొమా సర్టిఫికెట్‌తో పాటు రెండేళ్ల అనుభవం తప్పనిసరి. ప్రోగ్రామర్ పోస్టుకు కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్ మాస్టర్స్ పాస్ కావాలి. DOOEC కోర్సు బీ లెవెల్ ఎగ్జామినేషన్ పాసైనవారు కూడా దరఖాస్తు చేయొచ్చు.వేతనం- సర్వేయర్‌కు రూ.19,000, ప్రోగ్రామర్‌కు రూ.31,000.
వయస్సు- 30 ఏళ్ల లోపు
ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The Deputy General Manager (HR ),
BECIL’s Corporate Office,
BECIL Bhawan, C-56/A-17,
Sector-62 Noida-201307 (U.P)

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

IIT Hyderabad Jobs: ఐఐటీ హైదరాబాద్‌లో 152 జాబ్స్... ఫిబ్రవరి 17 లాస్ట్ డేట్

Indian Army Jobs: ఇండియన్ ఆర్మీలో 191 జాబ్స్... ఫిబ్రవరి 20 లాస్ట్ డేట్

AIIMS Recruitment 2020: ఎయిమ్స్‌లో 418 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

 
First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు