Jobs: మొత్తం 4,000 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

BECIL Recruitment 2020 | దరఖాస్తు గడువును 2020 మార్చి 20 వరకు పొడిగిస్తూ రివైజ్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://www.beciljobs.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

news18-telugu
Updated: March 18, 2020, 10:07 AM IST
Jobs: మొత్తం 4,000 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Jobs: మొత్తం 4,000 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
  • Share this:
బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL 4,000 పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. ఆసక్తి గల అభ్యర్థులు 2020 మార్చి 20 వరకు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2019 డిసెంబర్ 27న ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీని 2020 జనవరి 11 అని మొదట నోటిఫికేషన్‌లో ప్రకటించింది బీఈసీఐఎల్. కానీ పలు కారణాల వల్ల అప్లై చేయలేని అభ్యర్థులకు మరో అవకాశం కల్పించాలని నిర్ణయించింది. దరఖాస్తు గడువును 2020 మార్చి 20 వరకు పొడిగిస్తూ రివైజ్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://www.beciljobs.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి వారణాసి, గోరఖ్‌పూర్, బస్తీ, జౌన్‌పూర్, సిద్దార్థ్‌ నగర్, భదోహి, మీరట్, బులంద్‌షహర్, నోయిడాలో ట్రైనింగ్ ఉంటుంది.

BECIL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు



మొత్తం ఖాళీలు- 4,000 పోస్టులు
స్కిల్డ్ మ్యాన్‌ పవర్ (ఎలక్ట్రీషియన్ / లైన్‌మెన్ / ఎస్ఎస్ఓ)- 2,000 పోస్టులు
అన్‌స్కిల్డ్ మ్యాన్‌ పవర్ (ఎలక్ట్రీషియన్ / లైన్‌మెన్ / ఎస్ఎస్ఓ)- 2,000 పోస్టులు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 27
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 20విద్యార్హత- ఎనిమిదో తరగతితో పాటు ఐటీఐ పాస్ కావాలి.
వయస్సు- 18 నుంచి 45 ఏళ్లు.
ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.250.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

DRDO Jobs: హైదరాబాద్‌ డీఆర్‌డీఓలో జాబ్స్... మార్చి 20 చివరి తేదీ

HAL Recruitment 2020: హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలు... మార్చి 23 చివరి తేదీ

NTA UGC NET 2020: యూజీసీ నెట్ జూన్ 2020 నోటిఫికేషన్ వచ్చేసింది... వివరాలివే

 
Published by: Santhosh Kumar S
First published: March 18, 2020, 10:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading